Krishnamma | సత్యదేవ్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్లు

Satya Dev's Krishnamma - సత్యదేవ్ తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమా వారం లోపే బ్రేక్ ఈవెన్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు.

Advertisement
Update:2024-05-16 23:13 IST

సత్యదేవ్ తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. గత వారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. రివెంజ్ డ్రామాగా, యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘కృష్ణమ్మ’. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను రిలీజ్ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని విడుదల చేశాయి. సత్యదేవ్‌లోని నటుడిలో మరో కొత్త కోణాన్ని ఈ చిత్రం ఆవిష్కరించింది.

కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి తొలి రోజునే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘కృష్ణమ్మ’. అలాగే తొలి 5 రోజుల్లో రూ. 5.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించటంతో సత్యదేవ్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

తొలి ఆట నుంచే ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ తన విజయయాత్రను కొనసాగించింది. యాక్షన్ మూవీగా ‘కృష్ణమ్మ’ మూవీని ఆడియన్స్‌ చక్కగా ఎంగేజ్ చేస్తున్నారని అంటున్నారు మేకర్స్.

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లక్ష్మణ్ మీసాల, రఘుకుంచె, అతీరా రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ సినిమాకు సంగీతాన్ని, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందించారు.

Tags:    
Advertisement

Similar News