సంతోష్ శోభన్ నుంచి మరో సినిమా రెడీ

సంతోష్ శోభన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు రాబోతున్నాయి. ఒక సినిమా విడుదల తేదీ ఆల్రెడీ ప్రకటించారు. ఇప్పుడు రెండో సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.

Advertisement
Update:2022-10-07 08:29 IST

ఒకేసారి రెండు సినిమాలు రెడీ చేశాడు సంతోష్ శోభన్. వీటిలో ఒకటి అన్నీ మంచి శకునములే అనే సినిమా కాగా, రెండోది లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్. ఈ రెండు సినిమాల్లో మొదటి సినిమాకు తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. ఇప్పుడు రెండో సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు.

అన్నీ మంచి శకునములే సినిమా డిసెంబర్ 21న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. ఇక లైక్-షేర్-సబ్ స్క్రైబ్ అనే సినిమాను నవంబర్4న విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. సో.. రాబోయే 2 నెలల్లో, సంతోష్ నుంచి వరుసపెట్టి 2 సినిమాలు రాబోతున్నాయన్నమాట.

దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి, ఆముక్త క్రియేషన్స్ తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది.

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో సంతోష్, ఫరియా అబ్దుల్లా బ్రీఫ్‌కేస్‌ పై కూర్చుని లవ్లీగా కనిపించారు.

ఇటివలే విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాన్స్, సస్పెన్స్‌తో పాటు క్రైమ్ ఎలిమెంట్స్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోంది. నెల్లూరు సుదర్శన్ ఈ సినిమాలో హిలేరియస్ పాత్రలో నటించగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు. 

Tags:    
Advertisement

Similar News