Yashoda Movie: భారీగా డ్రాప్ అయిన యశోద
Yashoda Movie Box Office Collections: సమంత లీడ్ రోల్ పోషించిన యశోద సినిమా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. సోమ, మంగళవారాల్లో ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది.
Samantha is overwhelmed with Yashoda's success
యశోద సినిమాకు మంచి టాక్ వచ్చింది. మొదటి 3 రోజులు వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక అంతా సెట్ అనుకున్నారంతా. అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. కీలకమైన సోమవారం, మంగళవారం రోజుల్లో ఈ సినిమా ఫుల్ గా డ్రాప్ అయింది.
సోమవారం సాధారణంగా ఏ సినిమాకైనా డ్రాప్ సహజం. యశోద సినిమాకు కూడా అదే ఊహించారు. కానీ ఊహించినదానికంటే ఎక్కువగా ఈ సినిమా డ్రాప్ అయింది. సోమవారం రోజున మెయిన్ సెంటర్స్ లో కనీసం 50శాతం ఆక్యుపెన్సీ ఆశించారు మేకర్స్. కానీ 30శాతం దాటలేదు.
ఇక మంగళవారం పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సహజంగా ఉండే డ్రాప్స్ కు తోడు, కృష్ణ అకాలమరణం యశోద సినిమాపై గట్టిగా పడింది. వైజాగ్, వెస్ట్, కృష్ణాతో పాటు సీడెడ్ లోని కొన్ని ప్రాంతాల్లో కృష్ణ మృతికి సంతాప సూచకంగా థియేటర్లు మూసేశారు. దీంతో యశోదకు కలెక్షన్లు పడిపోయాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 7 కోట్ల రూపాయలు రావాలి.