Samantha - సాయంత్రం 6 వరకే నేను స్టార్
Samantha reacts to her stardom - సాయంత్రం 6 వరకు మాత్రమే తను స్టార్ లా ఫీల్ అవుతానని, ఆ తర్వాత సాధారణ మహిళగా మారిపోతానని అంటోంది సమంత.
తను సాయంత్రం 6 గంటల వరకే స్టార్ ను అని చెబుతోంది సమంత. సాయంత్రమైతే ఓ సాధారణ మహిళగా మారిపోతానని, ఇంట్లో పనులన్నీ తనే చేసుకుంటానని అంటోంది.
"నేను పాన్ ఇండియా స్టార్‌ననే విషయాన్ని నా పెంపుడు జంతువులకి ఎవరైనా చెబితే బావుంటుంది. నా జీవితం మారిందని నేను అనుకోలేదు. నేను ఆరు గంటల దాకానే స్టార్‌ని. ఆ తర్వాత నా జీవితం చాలా సాదాసీదాగా ఉంటుంది."
కెరీర్ లో ఇన్ని మంచి పాత్రలు పోషిస్తానని అస్సలు ఊహించలేదంటోంది సమంత. మరీ ముఖ్యంగా ఫిమేల్ ఓరియంటెడ్ పాత్రలు చేస్తానని అనుకోలేదని, తన కల తీరిందని అంటోంది.
``నేను ఇక్కడిదాకా వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. నేను చేస్తున్న పాత్రల విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. గర్వపడుతున్నాను. నేను చేస్తున్న పని కష్టతరమైనదే. యాక్షన్ పాత్రలు కూడా చేస్తున్నాను. ఫ్యామిలీమేన్2లో నేను చేసిన కేరక్టర్ అలాంటిదే. ఎప్పుడూ స్క్రీన్ మీద ఎవరో ఒక హీరో వచ్చి కాపాడుతుంటే, బేలగా ఉండే పాత్రలే చేయనక్కర్లేదు. సబలగా కూడా నటించాలి. అలా నటించడం కొత్తగా ఉంది. దాన్ని ఆస్వాదిస్తున్నాను.``
శాకుంతలం సినిమాలో లీడ్ రోల్ పోషించింది సమంత. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నటించడం తన అదృష్టం అంటున్న సమంత.. ఇకపై కూడా తన సినీ ప్రయాణం ఇలానే సాగుతుందని స్పష్టం చేసింది.