Sagiletikatha | సెన్సార్ పూర్తి చేసుకున్న సగిలేటి కథ

Sagiletikatha - డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది సగిలేటి కథ. సెన్సార్ సభ్యులు కూడా ఇదే మాట అంటున్నారు.

Advertisement
Update:2023-09-23 23:23 IST

రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించాడు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి.

ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మూవీకి U/A సర్టిఫికెట్ వచ్చింది. ఈ చిత్రం చాలా నేచురల్ గా, సగటు ప్రేక్షకుడికి నచ్చేలా ఉందని, ఇలాంటి మూసకథలు మునుపెన్నడూ చూడలేదంటూ ప్రశంసించారంట సెన్సార్ బోర్డ్ సభ్యులు.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తవ్వడంతో సినిమా విడుదల తేదీని మరోసారి ప్రకటించారు. అక్టోబర్ 6న విడుదల కానుంది సగిలేటి కథ మూవీ.

ఈ సినిమాకు జశ్వంత్ పసుపులేటి సంగీతం అందించాడు. సనల్ వాసుదేవ్ నేపథ్య సంగీతం అందించాడు. రాజశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించడమే కాకుండా.. రచయితగా, సినిమాటోగ్రాఫర్ గా, ఎడిటర్ గా కూడా వర్క్ చేశాడు.

Tags:    
Advertisement

Similar News