ఆస్కార్ అవార్డ్ గెల్చుకున్న RRR మూవీలోని 'నాటు నాటు' పాట
Naatu Naatu Wins Oscar 2023: ఈ రోజు ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ నాటు నాటు పాట ప్రదర్శనతోనే ప్రారంభమైంది. ఆ సమయంలో హాల్ మొత్తం చప్పట్లతో, హర్షద్వానాలతో మారుమోగిపోయింది. అప్పటి నుంచి దాదాపు 3 గంటల పాటు ఒర్జినల్ సాంగ్ కేటగిరీ బహుమతి ప్రకటనకోసం భారత దేశం మొత్తం ఎదురు చూసింది. చివరకు ఎట్టకేలకు ఆసమయం రానే వచ్చింది. నాటు నాటు పాట ఆస్కార్ గెల్చుకున్నట్టు జ్యూరీ ప్రకటించింది.
ఎంతో కాలంగా ఎదురు చూసిన సమయం వచ్చింది. తెలుగు పాట 'నాటు నాటు' ఆస్కార్ అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. RRR మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ రోజు ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ నాటు నాటు పాట ప్రదర్శనతోనే ప్రారంభమైంది. ఆ సమయంలో హాల్ మొత్తం చప్పట్లతో హర్షద్వానాలతో మారుమోగిపోయింది. అప్పటి నుంచి దాదాపు 3 గంటల పాటు ఒర్జినల్ సాంగ్ కేటగిరీ బహుమతి ప్రకటనకోసం భారత దేశం మొత్తం ఎదురు చూసింది. చివరకు ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. నాటు నాటు పాట ఆస్కార్ గెల్చుకున్నట్టు జ్యూరీ ప్రకటించింది. పాట్ అరచయిత చంద్ర బోస్, సంగీత దర్శకులు కీరవాణి వేదికపైకి ఎక్కి ఈ అవార్డును అందుకున్నారు.
నాటు నాటు...' పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా... ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు. ఈ పాటను కీరవాణి తనయుడు కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకుంది. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కూడా 'నాటు నాటు...' పాట ఎంతగానో నచ్చింది. అమెరికాలో రాజమౌళిని కలిసిన ఆయన ఆ విషయం చెప్పడంతో 'దేవుడికి నాటు నాటు నచ్చింది' అని సంతోషం వ్యక్తం చేశారు.
'ఆర్ఆర్ఆర్' సినిమా తనకు ఎంతగానో నచ్చిందని 'టైటానిక్', 'అవతార్' చిత్రాల దర్శకుడు జేమ్స్ కామెరూన్ చెప్పారు. రెండుసార్లు సినిమా చూశానని ఆయన తెలిపారు. రామ్ చరణ్ పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంకా పలువురు హాలీవుడ్ దర్శకులు, రచయితలు, నిర్మాతలు సినిమా గురించి గొప్పగా చెబుతూ ట్వీట్లు చేశారు.
నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ లభించిన సన్నివేశం భారత్ దేశ సినీ ప్రేమికులందరి హృదయాలను ఉప్పొంగించింది. టాలీవుడ్ ప్రముఖులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఖ్యాతి మొత్తం రాజమౌళిదే అని RRR మూవీ నిర్మాత దానయ్య అన్నారు.
భారత సినీ రంగానికి అద్భుతమైన కీర్తిని తీసుకవచ్చిన రాజమౌళికి అభినందనలు తెలియజేశారు. ప్రముఖ నటులు చిరంజీవి అన్నారు. ఈ అవార్డు ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి కీర్తి ప్రతిష్ఠలు పెరిగాయని ఆయన అన్నారు.