వేసవి కానుకగా రవితేజ సినిమా

రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా ఈ ఏడాది థియేటర్లలోకి రాదని ఇప్పటికే ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించాం. ఇప్పుడీ సినిమాకు విడుదల తేదీ లాక్ అయింది.

Advertisement
Update:2022-10-25 11:02 IST

Ravanasura Movie Review: రావణాసుర మూవీ రివ్యూ {2/5}

లెక్కప్రకారం ఈ ఏడాది రవితేజ నుంచి ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీతో పాటు.. ధమాకా, రావణాసుర సినిమాలు కూడా రావాలి. కానీ వీటిలో ధమాకా మాత్రమే థియేటర్లలోకి వస్తోంది. రావణాసుర సినిమా ఈ ఏడాది థియేటర్లలోకి రాదనే విషయాన్ని తెలుగుగ్లోబల్ ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. రావణాసుర సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 7న థియేటర్లలోకి రాబోతోంది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ తో ప్రకటన కూడా వచ్చింది.

సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నాడు. ఇందులో రవితేజ చాలా చోట్ల నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. హీరోస్ డోన్ట్ ఎగ్జిస్ట్ అనే క్యాప్షన్ ను ఈ సినిమాకు తగిలించారు.

రావణాసురలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News