Matti Kusthi: రవితేజ షూటింగ్ కు రాలేదంటున్న హీరోయిన్
Matti Kusthi: రవితేజ నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ కు ఆయన ఒక్క రోజు కూడా వెళ్లలేదంట. ఆ మూవీ హీరోయిన్ ఈ విషయాన్ని బయటపెట్టింది.
మట్టి కుస్తీ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఐశ్వర్య లక్ష్మి. ఈ సినిమాను రవితేజ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే రవితేజ ఒక్క రోజు కూడా సెట్స్ లోకి రాలేదని, అందుకే అతడ్ని కలవలేకపోయానని స్పష్టం చేసింది. విష్ణు విశాల్ పై రవితేజకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అంటోంది.
"రవితేజ గారు షూటింగ్ కి రాలేదు. విష్ణు విశాల్ ని పూర్తిగా నమ్మి, కావాల్సింది సమకూర్చి ఫైనల్ ప్రోడక్ట్ ని మాత్రమే చూపించమన్నారు. ఫైనల్ అవుట్ పుట్ ని చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. విష్ణు విశాల్ పై రవితేజకు ఉన్న నమ్మకం అది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రవితేజ గారిని కలిశాను. అప్పటివరకు ఆయన్ను కలవలేదు."
మూడేళ్ల కిందటే మట్టి కుస్తీ కథ వినిందంట ఐశ్వర్య లక్ష్మి. ఆ తర్వాత కరోనా రావడంతో, అవకాశం మిస్ అయిందని భావించిందట. అయితే మూడో వేవ్ కరోనా ముగిసిన తర్వాత తిరిగి అదే కథ తన దగ్గరకు రావడం తన అదృష్టం అని చెప్పుకొచ్చింది.