Rashmika - తన మేనేజర్ పై స్పందించిన రష్మిక

Rashmika manager - రీసెంట్ గా తన మేనేజర్ ను తొలిగించింది రష్మిక. దీనికి సంబంధించి వచ్చిన పుకార్లను ఆమె ఖండించింది

Advertisement
Update:2023-06-23 18:50 IST

"మేనేజర్ తో విబేధాలు లేవు, ఇకపై విడిగా కెరీర్ సాగిస్తాం". హీరోయిన్ రష్మిక తాజా స్టేట్ మెంట్ ఇది. ఆమె ఈ స్టేట్ మెంట్ ఇవ్వడం వెనక చాలా పెద్ద కథ నడిచింది. ముందు అదేంటో చూద్దాం..

తన మేనేజర్ ను ఉన్నఫలంగా తొలిగించింది రష్మిక. దీంతో పుకార్లు గుప్పుమన్నాయి. రష్మికకు చెందిన 70 లక్షల రూపాయల్ని, మేనేజర్ పక్కదోవ పట్టించాడంటూ ఊహాగానాలు వినిపించాయి. వీటిపై రష్మిక పరోక్షంగా స్పందించింది.

మేనేజర్ తో విబేధాల కారణంగానే రష్మిక ఆయనతో వర్క్ చేయడం లేదంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రూమర్స్ పై స్పందించింది రష్మిక. తాము విడిగా పని చేయాలని నిర్ణయించుకోవడం వెనక ఎలాంటి గొడవలు లేవని ప్రకటన ఇచ్చింది.

"ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందంతో విడిగా కెరీర్ లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్ గా ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు అంతే హుందాగా విడిగా పని చేయాలని అనుకుంటున్నాం" అని రష్మిక ప్రకటన విడుదల చేసింది.

దీంతో ఈ పుకార్లకు చెక్ పడినట్టయింది. తాజా సమాచారం ప్రకారం, రష్మిక ఇప్పటికే మరో మేనేజర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆమె సినిమాల షూటింగ్స్ ఏవీ సెట్స్ పై లేకపోవడంతో.. పెద్దగా సమస్యలు ఎదురుకాలేదని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News