Rashmika Mandanna: మరోసారి వివాదాస్పదమైన రష్మిక

Rashmika Mandanna: మరో వివాదం రేపింది రష్మిక. ఈసారి బాలీవుడ్ కు, సౌత్ కు మధ్య పోలిక తీస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Advertisement
Update:2022-12-29 13:00 IST

Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ని బ్యాన్ చేస్తే ఒరిగేదేంటి?

రష్మికకు వివాదాలు కొత్తకాదు. అదేంటో కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈమె వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా కూడా కాంతార విషయంలో ఆమె కాంట్రవర్సీ సృష్టించింది. ఆ వివాదం సద్దుమణిగిందని అనుకునేలోపే మరో వివాదాస్పద స్టేజ్ మెంట్ ఇచ్చింది ఈ బ్యూటీ.

హిందీలో తను నటించిన మిషన్ మజ్ను అనే సినిమాకు ప్రచారం చేస్తోంది రష్మిక. ఆ సినిమా ప్రచారంలో భాగంగా రొమాంటిక్ సాంగ్స్ బాలీవుడ్ లో మాత్రమే వస్తాయని, సౌత్ సినిమాల్లో కేవలం మసాలా సాంగ్స్ మాత్రమే ఉంటాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

"రొమాంటిక్ సాంగ్స్ అంటే బాలీవుడ్. నా వరకు బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ విని పెరిగాను. సౌత్ లో మసాలా సాంగ్స్, ఐటెం నంబర్స్, డాన్స్ నంబర్స్ మాత్రమే కనిపిస్తాయి. రొమాంటిక్ సాంగ్స్ బాలీవుడ్ లో కనిపిస్తాయి."

ఇలా సౌత్ సినిమాను తక్కువచేసి మాట్లాడింది రష్మిక. నిజానికి కెరీర్ స్టార్టింగ్ లో ఆమెకు గుర్తింపు తెచ్చింది రొమాంటిక్ సినిమాలు, అందులో పాటలే. ఈ విషయాన్ని రష్మిక మరిచిపోయినట్టుంది.

Tags:    
Advertisement

Similar News