Game Changer | గేమ్ చేంజర్ డబ్బింగ్ పనులు ప్రారంభం

Game Changer - రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతోంది గేమ్ ఛేంజర్. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.

Advertisement
Update: 2024-08-07 16:45 GMT

రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇప్పటికే వదిలిన పోస్టర్స్, సాంగ్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఈ భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. తేదీని ఇంకా ప్రకటించలేదు.

తాజాగా గేమ్ ఛేంజ‌ర్ డ‌బ్బింగ్ ప‌నులు షురూ అయ్యాయి. పూజా కార్య‌క్ర‌మాల‌తో డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టారు.

విన‌య విధేయ రామ చిత్రంలో జోడీగా మెప్పించిన రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ.. గేమ్ ఛేంజ‌ర్‌లో అల‌రించ‌టానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్ పెయిర్ సంద‌డిని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడాల‌నే ఉత్సాహం అంద‌రిలోనూ క‌నిపిస్తోంది.

రీసెంట్ గా రామ్ చ‌ర‌ణ్ త‌న పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశాడు. డైరెక్టర్ శంకర్ మిగతా భాగాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. చాన్నాళ్ల తర్వాత శంకర్ తీస్తున్న ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా ఇదే.

గేమ్ ఛేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ ప్రైజ్‌కి దక్కించుకుంది. సినిమాలో అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News