Double Ismart | రామ్ సినిమా టీజర్ రిలీజ్

Double Ismart - ఎట్టకేలకు రామ్ పోతినేని నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. ఎలా ఉందో చూద్దాం..

Advertisement
Update: 2024-05-15 17:57 GMT

రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ కాంబోలో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌ ఇది. టైటిల్ సూచించినట్లుగా 'డబుల్ ఇస్మార్ట్' చిత్రం ప్రీక్వెల్‌కు రెట్టింపు మ్యాడ్ నెస్ గా ఉండబోతోంది. డైనమిక్ స్టార్ రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు.

హైదరాబాద్‌లోని ఒక ల్యాబ్‌లో ఉన్న హీరో పాత్రను తన చుట్టూ ఉన్న కొంతమంది శాస్త్రవేత్తలతో వివరించే వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. రామ్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్‌గా అదరగొట్టాడు. కావ్యా థాపర్‌ కథానాయికగా పరిచయమైంది. సంజయ్ దత్ బిగ్ బుల్ గా పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు.

టీజర్ చివర్లో అద్భుతంగా ఉంది. ఇస్మార్ట్ శంకర్ మాదిరిగానే, డబుల్ ఇస్మార్ట్ లో కూడా డివోషనల్ టచ్ ఉంది. మహా శివలింగం, క్లైమాక్స్ ఫైట్ హైలెట్ గా నిలిచేలా ఉన్నాయి.

మేకర్స్ చెప్పినట్టు.. డబుల్ ఇంపాక్ట్‌, డబుల్ డోస్ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది టీజర్. పూరి జగన్నాధ్ మరోసారి తన హీరోని బెస్ట్ స్టైలిష్, మాస్ , యాక్షన్ అవతార్‌లో ప్రజెంట్ చేశాడు. అతని టేకింగ్ చాలా స్టైలిష్‌గా ఉంది.

సంజయ్ దత్ స్టైలిష్ విలన్ గా, కావ్య థాపర్ గ్లామర్ బ్యూటీగా కనిపించగా.. టీజర్ లో అలీ కామెడీ రోల్ లో కనిపించాడు. పూరీ, అలీ ది హిలేరియస్ కాంబినేషన్శ అనే విషయం తెలిసిందే. మణిశర్మ నేపథ్య సంగీతం బాగుంది. డబుల్ ఇస్మార్ట్ ను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల చేయబోతున్నారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.

Full View

Tags:    
Advertisement

Similar News