Double Ismart | రామ్ నుంచి మరో మాస్ సాంగ్

Double Ismart - రామ్ హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ నుంచి రెండో పాట రిలీజైంది. ఇది పార్టీ సాంగ్.

Advertisement
Update: 2024-07-16 16:46 GMT

రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ సెన్సేషనల్ హిట్ ఇస్మార్ట్ శంకర్ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే మ్యూజికల్ హిట్ అయింది. అదే విధంగా, ఈ కాంబినేషన్‌లో సెకెండ్ మూవీ ఆల్బమ్ కూడా విడుదలకు ముందే హిట్టయ్యేలా ఉంది. ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ అయి న డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. ఇందులోంచి ఓ సాంగ్ ఆల్రెడీ హిట్టయింది. ఇప్పుడు రెండో పాటలో కూడా అదే లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు, సినిమా సెకెండ్ సింగిల్ మార్ ముంత చోడ్ చింత విడుదలైంది. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ బాగున్నాయి. హైదరాబాద్ యాసలో ఆకట్టుకున్నాయి.

ఇది దేశీ పార్టీ సాంగ్. మణిశర్మ కంపోజిషన్ మాస్ అప్పీల్ ఇచ్చింది. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజన్ సీపాన, కీర్తన శర్మ త్రయం ఈ పాటకు ఆలపించారు.

పాటలో రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవల్ లో ఉంది. ఎప్పట్లానే స్టెప్పులతో ఆకట్టుకున్నాడు రామ్. హుక్ స్టెప్ అయితే ఇనిస్టెంట్ గా హిట్టయింది. రామ్‌తో పాటు కాలు కదిపిన కావ్య థాపర్ ఈ పాటకు గ్లామర్ యాడ్ చేసింది.


పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ఆగస్ట్ 15న సినిమా విడుదల కానుంది.  

Full View

Tags:    
Advertisement

Similar News