Double Ismart | ఇస్మార్ట్ గా రెండో పాటకు రంగం సిద్ధం

Double Ismart - రెండో పాటతో రెడీ అయింది డబుల్ ఇస్మార్ట్ యూనిట్. సెకెండ్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో చూద్దాం.

Advertisement
Update:2024-07-13 22:49 IST

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో మోస్ట్-ఎవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ మ్యూజిక్ ప్రమోషన్‌ గ్రాండ్ గా మొదలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ పెద్ద హిట్టయింది. మేకర్స్ ఇప్పుడు మూవీ సెకండ్ సింగిల్-మార్ ముంత చోడ్ చింత అప్‌డేట్‌ ఇచ్చారు.

మార్ ముంత చోడ్ చింత అనేది ఈ సిరిస్ లో హీరో పాపులర్ డైలాగ్. పోస్టర్ లో సూచించినట్లు ఈ పాట మాస్ బ్లాస్ట్‌ను అందించబోతోంది. రామ్ రెండు బాటిళ్ల కల్లును ఆస్వాదిస్తూ కనిపించాడు. సెట్ కలర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా కనిపించనుంది.

ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని గియాన్నెలి సినిమాటోగ్రఫీ అందించారు. 'డబుల్ ఇస్మార్ట్' ఆగస్ట్ 15న గ్రాండ్ గా విడుదల కానుంది. రీసెంట్ గా సినిమా షూటింగ్ పూర్తయింది.




Tags:    
Advertisement

Similar News

'అఖండ 2' షురూ