Ramcharan | మరో స్పోర్ట్స్ ఫ్రాంచైజీలో చరణ్
Ram Charan - ఇప్పటికే పలు స్పోర్ట్స్ ఫ్రాంచైజీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు రామ్ చరణ్. ఇప్పుడు మరో ఫ్రాంచైజీకి ఓనర్ అయ్యాడు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) రంగం సిద్ధమైంది. టీ 10 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇన్నిరోజులు వీధుల్లో టెన్నిస్ బాల్‌తో ఆడే ఆటగాళ్లు ఇప్పుడు మైదానంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంచలనానికి తెర తీశారు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్)లో హైదరాబాద్ టీమ్‌ని ఆయన సొంతం చేసుకున్నారు. చరణ్‌తో పాటు అక్షయ్ కుమార్ (శ్రీనగర్), హృతిక్ రోషన్ (బెంగళూరు), అమితాబ్ బచ్చన్ (ముంబై) వంటి స్టార్స్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో భాగమయ్యారు.
ఇన్నాళ్లు వెలుగులోకి రాలేకపోతున్న యంగ్ అండ్ న్యూ టాలెంట్‌ను వెలికి తీయటానికి పలు టీమ్స్‌ని సొంతం చేసుకోవటం విశేషం. హైదరాబాద్ టీమ్‌ని చరణ్ సొంతం చేసుకోవటం ద్వారా మన భాగ్యనగరంలో క్రికెట్ స్ఫూర్తిని రగిలించటానికి సిద్ధమయ్యారు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్)లో తొలి ఎడిషన్ మార్చి 2 నుంచి మార్చి 9 వరకు ముంబై నగరంలో జరనుంది. ఇందులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కత్తా, జమ్మూ కాశ్మీర్ మధ్య 19 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.