Jailer Trailer | చైతూ రిలీజ్ చేసిన సూపర్ స్టార్ ట్రయిలర్

Jailer Movie Trailer Review - సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం జైలర్. ఈ సినిమా ట్రయిలర్ ను నాగచైతన్య రిలీజ్ చేశాడు. ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం..

Advertisement
Update: 2023-08-02 17:50 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ తొలిసారి కలసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'జైలర్‌' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కావాలయ్య, హుకుం పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జైలర్ థియేట్రికల్ ట్రైలర్ ని అక్కినేని నాగచైతన్య లాంచ్ చేశాడు.

రజనీకాంత్ పవర్ ఫుల్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్, స్వాగ్, డైలాగ్ డెలివరీ, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ అద్భుతంగా ఉంది. రజనీ తనదైన మార్క్ తో కట్టిపడేశారు. ఆసక్తికరమైన కథాంశంతో, ఆకట్టుకునే విజువల్స్ తో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ని అందిస్తూ మెస్మరైజ్ చేసి క్యురియాసిటీని పెంచింది ట్రైలర్.

దర్శకుడు నెల్సన్ రజనీకాంత్ పాత్రని చాలా యూనిక్ అండ్ పవర్ ఫుల్ గా డిజైన్ చేసి తన దర్శకత్వ ప్రతిభతో ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే నెల్సన్ మార్క్ వినోదం కూడా కనిపిస్తోంది. ట్రైలర్ లో జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ ల ప్రజెన్స్ కూడా ఆకట్టుకుంది.

అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాను, 10వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది.

Full View

Tags:    
Advertisement

Similar News