Rajinikanth: ఫ్యాన్స్‌కి రజనీ స‌ర్‌ప్రైజ్‌.. ఒకేసారి రెండు సినిమాల ప్రకటన

Rajinikanth: రజనీకాంత్ ఇప్పుడు అభిమానులకు డబుల్ స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఒకేసారి రెండు సినిమాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు. గతంలో ఆయనతో రోబో 2.0 అనే సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ రెండు సినిమాలను నిర్మించనుంది.

Advertisement
Update:2022-10-29 11:51 IST

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొన్నేళ్లుగా సినిమాల సంఖ్యను బాగా తగ్గించాడు. ఆయన గత ఏడాది న‌టించిన‌ పెద్దన్న సినిమా దారుణ ఫలితాన్ని ఇచ్చింది. దీంతో చాలా నెలల పాటు మరో సినిమాను అంగీకరించలేదు రజనీ. ఆ తర్వాత ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పాడన్న ప్రచారం కూడా జరిగింది. అంతలోనే ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమాను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.

రజనీకాంత్ ఇప్పుడు అభిమానులకు డబుల్ స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఒకేసారి రెండు సినిమాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు. గతంలో ఆయనతో రోబో 2.0 అనే సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ రెండు సినిమాలను నిర్మించనుంది. శుక్రవారం లైకా ప్రొడక్షన్స్ అధినేతలు సుభాస్కరన్, ప్రేమ్ శివ స్వామి రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఆ తర్వాత రజనీకాంత్‌తో వారు చేయబోయే సినిమాల గురించి ప్రకటించారు.

నవంబర్ 5వ తేదీన చెన్నైలో పూజా కార్యక్రమాలతో రెండు సినిమాలను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. రజనీకాంత్ నటించే రెండు సినిమాలకు దర్శకులు, ఆ సినిమాల్లో నటించే హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను అతి త్వరలోనే ప్రకటించనున్నారు. 2.0 లాగానే ఈ రెండు సినిమాలను భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. రజనీ తాజాగా చేస్తున్న జైలర్ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది.

Tags:    
Advertisement

Similar News