Rajinikanth: రజనీ మేనియా.. ఫ్లాప్‌ మూవీ కోసం థియేటర్లకు పోటెత్తిన జనం

మామూలుగా రీ రిలీజ్ సినిమాలకు బెనిఫిట్ షోలు ఏమి ఉండవు. మార్నింగ్ షో నుంచి షోలు వేయడం ప్రారంభిస్తుంటారు. అయితే బాబా సినిమా చూసేందుకు తెల్లవారుజామునే ఫ్యాన్స్ పోటెత్తడంతో తమిళనాడులోని అన్ని కేంద్రాల్లో ఉదయం 8 గంటలకే ఫస్ట్ షో ప్రదర్శించారు.

Advertisement
Update:2022-12-10 13:48 IST

తమిళనాడులో రజనీకాంత్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన నటించిన సినిమా విడుదల అయిందంటే అదొక పెద్ద పండుగలా చేస్తారు. కొత్త సినిమా విడుదలైన సమయంలో ఈ సందడి మామూలే అయినా రజనీ నటించి 20 ఏళ్ల కిందట విడుదల అయిన బాబా మూవీని రీ రిలీజ్ చేయగా ఫ్యాన్స్‌తో థియేటర్లు కిక్కిరిసిపోయాయి.

ఇటీవల తమ అభిమాన హీరోల పుట్టినరోజు పురస్కరించుకొని గతంలో ఆయా హీరోలు నటించిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే డిసెంబర్ 12న రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా 11వ తేదీన‌ ఆయన నటించిన బాబా సినిమాను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

కాగా ఆ సినిమా రేపు విడుదల కావాల్సి ఉండగా ఫ్యాన్స్ కోరిక మేరకు ఒక రోజు ముందే అంటే ఇవాళే ప్రీమియర్ షోలు వేశారు. మామూలుగా రీ రిలీజ్ సినిమాలకు బెనిఫిట్ షోలు ఏమి ఉండవు. మార్నింగ్ షో నుంచి షోలు వేయడం ప్రారంభిస్తుంటారు. అయితే బాబా సినిమా చూసేందుకు తెల్లవారుజామునే ఫ్యాన్స్ పోటెత్తడంతో తమిళనాడులోని అన్ని కేంద్రాల్లో ఉదయం 8 గంటలకే ఫస్ట్ షో ప్రదర్శించారు.

భారీగా తరలివచ్చిన అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. కటౌట్లు, బ్యానర్లు కట్టారు. ఈలలు, కేకలతో థియేటర్లు మార్మోగిపోయాయి. చెన్నైలోని ఒక థియేటర్‌లో వేసిన ప్రీమియర్ షోకి బాబా చిత్ర యూనిట్ తోపాటు రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్, ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్, నటుడు రాఘవ లారెన్స్ హాజరయ్యారు.

బాబా సినిమాలో రజనీకాంత్ సరసన మనీషా కోయిరాల హీరోయిన్‌గా నటించగా..సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. నరసింహ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రజనీ ఒక ఆధ్యాత్మికత మేళవించి బాబా మూవీ తీయడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాగా రీ రిలీజ్‌లో మాత్రం ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News