Raghava Lawrence | దయచేసి విరాళాలు ఇవ్వొద్దంటున్న లారెన్స్

Raghava Lawrence - లారెన్స్ కు స్వచ్చంధ సంస్థ ఉంది. ఆ ఛారిటీ సంస్థకు డొనేషన్స్ ఇవ్వొద్దంటున్నాడు ఈ హీరో కమ్ దర్శకుడు.

Advertisement
Update:2023-08-30 23:03 IST

రాఘవ లారెన్స్... సైడ్ డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత కొరియోగ్రాఫర్ స్థాయికి అక్కడి నుంచి దర్శకుడు, నటుడు, నిర్మాత స్థాయికి ఎదిగాడు. తను సంపాదించిన డబ్బుని కేవలం తనకు, తన వాళ్లకు మాత్రమే ఖర్చు చేయాలని కాకుండా సమాజంలో పేద వారి కోసం కూడా ఖర్చు చేసేందుకు ఓ ట్రస్టును స్థాపించాడు.

60 మంది పిల్లలను పెంచటంతో పాటు వికలాంగులకు డాన్స్ నేర్పించటం, కరోనా సమయంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయటం, గుండె ఆపరేషన్స్ చేయించటం.. ఇలా క్రమంగా తన సేవా కార్యక్రమాలను పెంచుకుంటూ వెళుతున్నాడు. అయితే తన ఛారిటీకి ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అలా చెప్పటానికి కారణం ఉంది.

"నా ట్రస్ట్ కి ఎవరూ డబ్బులు పంపొద్దు..నా పిల్లల్ని నేనే చూసుకుంటాను.. అని కొన్ని రోజుల ముందు రిక్వెస్ట్ చేస్తూ నేను ఒక ట్వీట్ వేశాను. అందుకు కారణమేంటంటే నేను డాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఓ ట్రస్ట్ ను స్టార్ట్ చేశాను. అందులో 60 మంది పిల్లల్ని పెంచటం, వికలాంగులకు డాన్స్ నేర్పించటం, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించటం వంటి కార్యక్రమాలను నిర్వహించాను. ఈ పనులన్నింటినీ నేను ఒక్కడ్నే చేయలేకపోయాను. అందుకనే ఇతరుల నుంచి సాయం కావాలని కోరాను. అప్పుడు రెండేళ్లకు ఓ సినిమా చేసేవాడిని. కానీ ఇప్పుడు సంవత్సరానికి 3 సినిమాలు చేస్తున్నాను. బాగానే డబ్బులు వస్తున్నాయి. నా ఛారిటీ నేను నడుపుకోగలను."

ఇలా వీడియో రిలీజ్ చేసి మరీ తన ఛారిటీకి విరాళాలు ఇవ్వొద్దని రిక్వెస్ట్ చేశాడు లారెన్స్. తను పొగరుతో ఈ విజ్ఞప్తి చేయడం లేదని, చాలామంది సహాయం కోసం వేచిచూస్తున్నారని, వాళ్లకు సాయం చేయాలని లారెన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. తన ద్వారా మాత్రమే సాయం చేయాలని ఎవరైనా భావిస్తే, అలాంటి వాళ్లకు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవాళ్లను పరిచయం చేస్తానని, నేరుగా సాయం చేయొచ్చని సూచిస్తున్నాడు లారెన్స్.

Tags:    
Advertisement

Similar News