చరిత్ర సృష్టించించిన పుష్ప-2 మూవీ
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 మూవీ చరిత్ర సృష్టించింది.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 మూవీ చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ.294 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంకు సుకుమార్ దర్శకత్వం వహించగా హీరోయిన్ రష్మిక మందన్నాహీరోయిన్‌గా నటించింది. ఇక టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్‌లను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
ఇక ఈ కలెక్షన్స్‌లో ఇండియా వైడ్ రూ.200 కోట్లు రాగా.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. ఇక ఈ ఏడాదిలో మొదటిరోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన చిత్రంగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. అంతకుముందు ఈ రికార్డు ఎన్టీఆర్ నటించిన దేవరతో (రూ.172 కోట్లు) పాటు.. ప్రభాస్ కల్కి (రూ.192 కోట్లు) చిత్రాలపై ఉంది. ఓవరాల్‌గా ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో పుష్ప 2 మొదటి స్థానంలో ఉండగా.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ (రూ. 223 కోట్లు) రెండో స్థానంలో.. ప్రభాస్ బాహుబలి 2 (రూ. 214 కోట్లు), కల్కి (రూ.192 కోట్లు), సలార్ (రూ.178 కోట్లు) వరుసగా మూడు నాలుగు, ఐదు స్థానాల్లో ఉండగా.. ఎన్టీఆర్ దేవర (రూ.172 కోట్లు) ఆరో ప్లేస్‌లో ఉంది. ఇంకా ఇవే కాకుండా.. కేజీఎఫ్ (రూ.162 కోట్లు), లియో (రూ.140 కోట్లు) షారుఖ్ జవాన్, యానిమల్ తదితర చిత్రాలు ఉన్నాయి.