ఆరు రోజుల్లోనే రూ.వెయ్యి కోట్ల వసూళ్లు
బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించిన పుష్ప -2
Advertisement
అల్లు అర్జున్, సుకుమార్, రష్మికా మంథన క్రేజీ కాంబినేషన్‌లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప -2 మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది. కేవలం ఆరు రోజుల్లోనే కలెక్షన్లలో రూ.వెయ్యి కోట్ల మార్క్ క్రాస్ చేసింది. మొత్తంగా పుష్ప -2 మూవీ రూ.1,002 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. బాహుబలి -2, ట్రిపుల్ ఆర్, కల్కి తర్వాత ఇంత స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా కూడా పుష్ప -2నే. పుష్ప -2 రిలీజ్ రోజే రూ.294 కోట్ల వసూళ్లతో కొత్త చరిత్ర నమోదు చేసింది.
Advertisement