కలెక్షన్స్‌లో పుష్ప -2 సరికొత్త రికార్డు

21 రోజుల్లోనే రూ.1700 కోట్ల క్లబ్‌ లో చేరిన అల్లు అర్జున్‌ మూవీ

Advertisement
Update:2024-12-26 16:59 IST

కలెక్షన్స్‌ లో పుష్ప -2 దూసుకుపోతుంది. అతి తక్కువ రోజుల్లో హయ్యెస్ట్‌ కలెక్షన్లతో సరికొత్త రికార్డును ఈ సినిమా సొంతం చేసుకుంది. అల్లు అర్జున్‌, సుకుమార్‌, రష్మిక మంథన కాంబినేషన్‌లో వచ్చిన ఈ క్రేజీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 5న రిలీజ్‌ అయ్యింది. మొదటి ఆరు రోజుల్లోనే రూ.వెయ్యి కోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించిన పుష్ప -2 ఇప్పుడు 21 రోజుల్లోనే రూ.1,705 కోట్లకు పైగా వసూలు చేసి మరో రికార్డును సొంతం చేసుకుంది. 2024లో విడుదలైన ఇండియన్‌ సినిమాల్లోనే టాప్‌ కలెక్షన్లు కూడా ఈ సినిమా సొంతమయ్యాయి.

Tags:    
Advertisement

Similar News