దర్శకుడు రాజమౌళి వేధింపులు భరించలేక చనిపోతున్నా : శ్రీనివాసరావు
టాలీవుడ్ స్టార్ డైరక్టర్ రాజమౌళి టార్చర్ భరించలేక నేను చనిపోతున్నా అంటూ రాజమౌళి స్నేహితుడి సూసైడ్ వీడియో విడుదల చేశారు.
Advertisement
ప్రముఖ టాలీవుడ్ డైరక్టర్ రాజమౌళి ఆయన భార్య రమా టార్చర్ భరించలేక నేను చనిపోతున్నా అంటూ రాజమౌళి స్నేహితుడి సూసైడ్ వీడియో లెటర్ విడుదల చేయడం సంచలనంగా మారింది. తనకు రాజమౌళితో 34 ఏళ్ల నుంచి స్నేహం ఉందని పేర్కొన్నాడు. రాజమౌళిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. రాజమౌళిపై శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు టాలీవుడ్‌లో హాట్ టాఫీక్‌గా మారింది. యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా శ్రీనివాస్ రావు వ్యవహరించారు. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని అయితే ఓ అమ్మాయి కారణంగా మా మధ్య ట్రయంగిల్ లవ్ స్టోరీతో విభేధాలు మొదలయ్యాయన్నారు. నేను ఇదంతా పబ్లిసిటీ కోసం చేయడం లేదని స్పష్టం చేశాడు. నేను చెప్పిన విషయాలపై పోలీసులు వారిని లై డిటెక్టర్ టెస్టులు చేయాలని కోరాడు.
Advertisement