నా కుటుంబాన్ని కాపాడిన మీరే నిజమైన హీరోలు

లాస్ ఏంజెలెస్‌లో దావానంలా వ్యాపించిన కార్చిచ్చుకు సంబంధించిన ఫొటోలను పంచుకున్న ప్రియాంక

Advertisement
Update:2025-01-16 12:43 IST

అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో దావానంలా వ్యాపించిన కార్చిచ్చు కారణంగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఎంతోమంది సంపన్నుల ఇండ్లు మంటల్లో బూడిదయ్యాయి. లాస్‌ ఏంజెలెస్‌లోనే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా నివాసముంటున్న విషయం విదితమే. తాజాగా ఆమె దీనిపై ఆవేవన వ్యక్తం చేశారు. ఈ విధ్వంసానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్న ప్రియాంక అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

'నేను ఎంతో బాధపడుతున్నానో మాటల్లో చెప్పలేను. ఈ కార్చిచ్చు నుంచి నా కుటుంబాన్ని కాపాడిన వారికి రుణపడి ఉంటాను. నా స్నేహితులు, సహచరులు ఎంతోమంది నివాసాలను కోల్పోయారు. వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ మంటల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించుకోవడానికి అధికస్థాయిలో మద్దతు అవసరం. ఈ విధ్వంసం నుంచి ప్రజలను కాపాడటం కోసం అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు వారి ప్రాణానలు పణంగా పెట్టి పనిచేశారు. మీరే నిజమైన హీరోలు' అని పోస్టు పెట్టారు.

ఇలాంటి పరిస్థితుల్లో సమష్టి కృషి అవసరమని ప్రియాంక అన్నారు. వారం రోజుల నుంచి ఎంతో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని అన్నారు. సర్వస్వం కోల్పోయిన వారికి విరాళాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుగా భావిస్తున్న లాస్‌ ఏంజెలెస్‌ ప్రాంతంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. పొడి వాతావరణం అగ్నికి ఆజ్యం పోస్తుండగా..కార్చిచ్చు విస్తరిస్తూనే ఉన్నది. శాన్‌ఫ్రాన్సిక్కో అంత విస్తీర్ణాన్ని దావాగ్ని చుట్టుముట్టి బూడిదగా మార్చేస్తున్నది.

Tags:    
Advertisement

Similar News