Kalki Trailer | కల్కి ట్రయిలర్ రివ్యూ

Kalki Trailer Review - ప్రభాస్ కల్కి ట్రయిలర్ రిలీజైంది. హాలీవుడ్ రేంజ్ కు ఏమాత్రం తీసిపోదు.

Advertisement
Update: 2024-06-10 17:50 GMT

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి’, భారీ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. కల్కి ప్రపంచాన్ని ఈ ట్రయిలర్ అద్భుతంగా ఆవిష్కరించింది. 2 నిమిషాల 51 సెకన్ల నిడివి గల ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్ మైథాలజీ వరల్డ్ లోకి తీసుకెళ్ళింది. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ చూపుతిప్పుకోనివ్వవు.

ట్రైలర్‌లో, అమితాబ్ బచ్చన్ తన యాక్షన్ పవర్ ని ప్రజెంట్ చేసి, అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోశారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ తన అద్భుతమైన పాత్రలో నిజంగా గుర్తుపట్టలేనంతగా కనిపించారు. ఇక ప్రభాస్, తన బెస్ట్ ఫ్రెండ్ 'బుజ్జి'తో అదరగొట్టాడు. దీపికా పదుకొనే ప్రతి ఫ్రేమ్‌లో ఎమోషన్స్ పండించింది. దిశా పటాని యాక్షన్ చూపించింది. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందంకు కూడా ట్రయిలర్ లో చోటు దక్కింది.

ప్రతి అంశంలోనూ అద్భుతం అనిపిస్తూ, కట్ చేశారు కల్కి ట్రయిలర్. ఈ ట్రయిలర్ తో అసలైన పాన్-ఇండియన్ మూవీ అనిపించుకుంది కల్కి.

'కల్కి 2898 AD' లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ గా 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది కల్కి.

Full View

Tags:    
Advertisement

Similar News