Slaar 2 | ప్రభాస్ కు ఫుల్ గా డైలాగ్స్

Salaar 2 - ప్రభాస్ త్వరలోనే సలార్-2 సెట్స్ పైకి రాబోతున్నాడు. సీక్వెల్ లో ప్రభాస్ పై చాలా డైలాగ్స్ ఉన్నాయంట.

Advertisement
Update:2024-05-13 14:52 IST

సలార్ సినిమా సూపర్ హిట్టయింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న ఈ సినిమాకు సంబంధించి ప్రతి ఎలిమెంట్ ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ఒక్కటి తప్ప..

సలార్ సినిమాలో ప్రభాస్ కు డైలాగ్ పార్ట్ చాలా తక్కువగా ఉంది. ఎలివేషన్స్ బాగానే ఉన్నాయి కానీ ప్రభాస్ తో కొన్ని పవర్ పుల్ డైలాగ్స్ చెప్పిస్తే ఇంకా బాగుండేది. ఆ లోటు అలానే ఉండిపోయింది. ఇప్పుడా లోటును భర్తీ చేసే పనిలో ఉన్నాడు ప్రశాంత్ నీల్.

ఈ నెల్లోనే సలార్-2 సెట్స్ పైకి వస్తోంది. పార్ట్-2లో ప్రభాస్ కోసం అదిరిపోయే డైలాగ్స్ రాశాడంట ప్రశాంత్ నీల్. నిజానికి కథ ప్రకారం, పార్ట్-2లోనే ప్రభాస్ కు ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయంట. అందుకే పార్ట్-1లో ప్రభాస్ పై పెద్దగా డైలాగ్స్ లేనట్టు అనిపిస్తుందని అంటున్నాడు నీల్.

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రాబోతోంది సలార్-2. ఈ సినిమా కోసం ఇప్పటికే పృధ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, బాబీ సిమ్హా కాల్షీట్లు కేటాయించారు. ప్రభాస్ అందుబాటులోకి వచ్చిన వెంటనే షూట్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ప్రభాస్ టైమ్ కు అందుబాటులోకి రాకపోతే.. మిగతా ఆర్టిస్టులతో షూట్ మొదలుపెడతారు.

Tags:    
Advertisement

Similar News

'అఖండ 2' షురూ