Salaar Movie | ఏపీ సర్కార్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం

Salaar Movie | ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సలార్ సినిమాకు ప్రత్యేక అనుమతులు వచ్చేశాయి. అయితే ఏపీ ప్రభుత్వంపై మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

Advertisement
Update:2023-12-20 20:55 IST

సలార్ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే . తెలంగాణ ప్రభుత్వం అనుకున్న పెంపును ఇచ్చి అర్ధరాత్రి, స్పెషల్ షోలను కూడా అనుమతించింది. అయితే సలార్ టిక్కెట్ ధరలపై ప్రభాస్ అభిమానులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు.

నైజాంలో మొదటి రోజు ఎంపిక చేసిన స్క్రీన్‌లలో ఏడు షోలను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సాలార్ టీమ్‌కు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లకు 65 రూపాయల పెంపు, మల్టీప్లెక్స్‌లలో ఒక వారం పాటు 100 రూపాయల పెంపుతో సహా మొదటి రోజున రాష్ట్రంలో ఆరు షోలను అనుమతించారు. దీంతో మేకర్స్, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక షోల నిర్వహణకు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక అనుమతులు మంజూరు చేయలేదని, టికెట్ పెంపు విషయానికొస్తే.. కేవలం రూ.40 స్వల్ప పెంపునకు మాత్రమే అనుమతి లభించింది. అదే ఆర్ఆర్ఆర్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.75 పెంచింది. అంతేకాదు, సర్కారువారి పాట (రూ. 45), ఆదిపురుష్ (రూ. 50)కు కూడా రేట్లు పెంచింది.


కానీ సలార్ కు కేవలం 40 రూపాయలు పెంచిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. సలార్ భారీ చిత్రం అయినప్పటికీ, ప్రభుత్వం కేవలం 40 రూపాయలు మాత్రమే పెంచిందనేది వీళ్ల ఆరోపణ.

Tags:    
Advertisement

Similar News