Rakshana Movie | పాయల్ సినిమాకు రిలీజ్ డేట్

Rakshana Movie - పాయల్ రాజ్ పుత్ తాజా చిత్రం రక్షణ. ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ అయింది.

Advertisement
Update: 2024-05-27 17:19 GMT

ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా..ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘రక్షణ’. రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ర‌క్ష‌ణ చిత్రం మెప్పించ‌నుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుద‌ల చేస్తున్నారు.

ఇదొక క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయిల్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించామంటున్నాడు దర్శకుడు.

ఈ సినిమాకు సంబంధించి ఓ వివాదం కొనసాగుతుంది. బ్యాలెన్స్ ఎమౌంట్ ఇవ్వాల్సిందిగా పాయల్ డిమాండ్ చేస్తోంది. అటు నిర్మాత మాత్రం ప్రమోషన్ చేస్తే బ్యాలెన్స్ ఎమౌంట్ ఇస్తానంటున్నాడు. ఈ సినిమా ప్రచారానికి పాయల్ వస్తుందా రాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Tags:    
Advertisement

Similar News