Panchathantram OTT - మరో సినిమా దక్కించుకున్న ఈటీవీ

Panchathantram movie OTT - విమర్శకుల ప్రశంసలు అందుకున్న పంచతంత్రం సినిమా ఓటీ టీ లో సందడి చేయనుంది.

Advertisement
Update:2023-03-17 17:09 IST

Panchathantram Movie Review: ‘పంచతంత్రం’ రివ్యూ {2.5/5}

ఓటీటీ అనగానే ఎవరైనా అమెజాన్ ప్రైమ్ గుర్తొస్తుంది. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్, ఆహా లాంటి సంస్థలు గుర్తొస్తాయి. ఇంకాస్త లోతుగా వెళ్తే డిస్నీ హాట్ స్టార్, జీ5 లాంటి కంపెనీలున్నాయి. అయితే ఈ లిస్ట్ లో ఈటీవీ విన్ అనే సంస్థ కూడా ఉందనే విషయాన్ని చాలామంది గుర్తించరు. ఎందుకంటే, సినిమాల డిజిటల్ రైట్స్ దక్కించుకునే విషయంలో ఈ సంస్థ, చాలా నెమ్మది. పైగా స్టార్ ఎట్రాక్షన్ ఉన్న సినిమాలకు ఇది చాలా దూరం. 


అయితే చిన్న సినిమాల్లో మంచి వాటిని ఏరికోరి తీసుకుంటుంది ఈటీవీ విన్ సంస్థ. ఇందులో భాగంగా పంచతంత్రం అనే యాంథాలజీ మూవీని దక్కించుకుంది. ఆ డీటెయిల్స్ చెక్ చేద్దాం..


హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద, నరేష్ అగస్త్య, శ్రీవిద్య ప్రధాన తారాగణంగా నటించిన అంథాలజీ ‘పంచతంత్రం’. ది వీకెండ్ షో స‌మ‌ర్ప‌ణ‌లో టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజిన‌ల్స్ బ్యాన‌ర్స్‌పై హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వంలో అఖిలేష్ వ‌ర్ధ‌న్‌, స్రుజ‌న్ ఎర‌బోలు ఈ అంథాల‌జీని నిర్మించారు.


గ‌త ఏడాది ‘పంచతంత్రం’ను డిసెంబ‌ర్ 9న థియేట‌ర్స్‌లో విడుద‌ల చేశారు. అందులో కాన్సెప్ట్స్‌, న‌టీన‌టుల ప్ర‌తిభ‌, టెక్నీషియ‌న్స్ టేకింగ్ ఆడియెన్స్‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాయి. మ‌న శరీరంలోని పంచేద్రియాల‌ను జ్ఞాప‌కాల‌తో అనుసంధానిస్తూ జీవితాన్ని చూడాల‌నే పాయింట్‌తో ఈ అంథాల‌జీని చ‌క్క‌గా తెర‌కెక్కించార‌ని, అలాగే ఐదు క‌థ‌ల హృద‌య స్పంద‌న‌గా పంచ‌తంత్రంను రూపొందించార‌ని క్రిటిక్స్ త‌మ రివ్యూస్ ద్వారా అభినందించారు.


 ప్రేమ‌, భ‌యం, చావు, న‌మ్మ‌కం, ల‌క్ష్యాల‌ను సాధించ‌టం అనే అంశాలతో వేర్వేరు ఐదు క‌థ‌ల స‌మాహారంగా ఈ అంథాల‌జీని రూపొందించారు. ఈ అంథాల‌జీ మార్చి 22న ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Tags:    
Advertisement

Similar News