చల్లబడుతున్న ఓటీటీ వేడి- ఇది క్లయిమాక్సే?

దేశంలో వినోద కాలక్షేపానికి కొత్త ప్రత్యామ్నాయాలు తెరుచుకోవడంతో, నగరాలు ఓటీటీ సభ్యత్వాలతో సంతృప్త స్థాయికి చేరుకోవడంతో, వీడియో స్ట్రీమింగ్‌ వేడి చల్లబడుతోంది.

Advertisement
Update:2023-11-07 11:35 IST

చల్లబడుతున్న ఓటీటీ వేడి- ఇది క్లయిమాక్సే!

దేశంలో వినోద కాలక్షేపానికి కొత్త ప్రత్యామ్నాయాలు తెరుచుకోవడంతో, నగరాలు ఓటీటీ సభ్యత్వాలతో సంతృప్త స్థాయికి చేరుకోవడంతో, వీడియో స్ట్రీమింగ్‌ వేడి చల్లబడుతోంది. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ ప్రకారం, ఓటీటీ వేదికల్లో మొత్తం ప్రేక్షకులు 2022లో 42.38 కోట్ల నుంచి 13.5% పెరిగి 48.11 కోట్లకు చేరుకున్నారు. ఇది మునుపటి సంవత్సరం కంటే 20% పెరుగుదల. ఇప్పుడు స్ట్రీమింగ్ యాప్‌లు 140 కోట్ల జనాభాలో 34% మందికి చేరుకున్నాయి. స్పష్టంగా తెలుస్తున్న కారణాల వల్ల వృద్ధి రేటు పడిపోయిందని, కోవిడ్ మహమ్మారితో నేరుగా ముడిపడి వున్న బూస్ట్ ప్రభావాలు ఇప్పుడు తగ్గాయని, వృద్ధి ఇప్పుడు మందకొడిగా వుందనీ; ఇది డేటా ధర, డిజిటల్ మాధ్యమం వృద్ధి వంటి అంశాలతో ముడిపడి వుందనీ, ఒర్మాక్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ శైలేష్ కపూర్ నిన్న వెల్లడించారు.

ముఖ్యంగా జనాభాలో గణనీయమైన భాగం వున్న గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో పాన్-ఇండియా సంఖ్య 34% తో పోలిస్తే 23% మాత్రమే వుందని కపూర్ ఎత్తి చూపారు. ఓటీటీ వేదికలు ఇప్పుడు టాప్ 20 నగరాలకు మించి వినియోగదారుల్ని పెంచుకోగలమా అన్న సవాలుని ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. ఆయన ప్రకారం, ఎస్వీఓడీ (సబ్‌స్క్రిప్షన్ వీడియో-ఆన్-డిమాండ్) సెగ్మెంట్లో 16% లేదా 7.72 కోట్ల మంది పరోక్ష వినియోగదారులున్నారు. దీనర్థం ఈ వినియోగదార్లు ఈ వేదికల్లో కంటెంట్‌ని చూస్తారు కానీ ఏ చందా చెల్లించరు. వారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సభ్యత్వాలని ఉపయోగించి చూస్తారు. దాదాపు 8.2%, లేదా 3. 95 కోట్లమంది కనీసం ఒక సబ్‌స్క్రిప్షన్ చెల్లించిన చెల్లింపు సభ్యులుగా వున్నారు కానీ అది కూడా టెలికాం ప్యాక్‌ల ద్వారా మాత్రమే తప్ప నేరుగా కాదు. కేవలం 7.6% లేదా 3.64 కోట్ల మంది చెల్లింపు సభ్యులు కనీసం ఒక సబ్‌స్క్రిప్షన్ కి నేరుగా (టెలికాం ప్యాక్‌ల ద్వారా మాత్రమే కాకుండా) చెల్లించారు.

నివేదిక ప్రకారం, దాదాపు 41.2% లేదా 19.81 కోట్ల మంది వ్యక్తులు యూట్యూబ్ తో పాటు కనీసం ఒక ఓటీటీ వేదిక సహా ఉచిత స్ట్రీమింగ్ వేదికల్లో మాత్రమే వీడియోలని వీక్షించే ఏవీ ఓడీ+ (ప్రకటనల ఆధారిత వీడియో-ఆన్-డిమాండ్) వర్గంలో వున్నారు. మొత్తం ఓటీటీ సెగ్మెంట్లో దాదాపు 27% లేదా 12.99 కోట్ల మంది ప్రజలు యూట్యూబ్ లేదా సోషల్ మీడియా వేదికల్లో మాత్రమే మాత్రమే వీడియోల్ని చూస్తున్నారు.

ఎస్వీఓడీ సెగ్మెంట్లో చందాదారులు 2023లో 13. 02 కోట్ల నుంచి 15.30 కోట్లకు 18% పెరిగారు. దేశంలోని మొత్తం ఓటీటీ ప్రేక్షకుల్లో ఎస్వీఓడీ వాటా గతంలోని 30.8% నుంచి స్వల్పంగా పెరిగింది. ఈ సంవత్సరం 31.8% గావుంది. అదే సమయంలో, ఏవీఓడీ సెగ్మెంట్ లో 18.45 కోట్ల నుంచి 19.81 కోట్లకు 7% పెరిగింది. యూట్యూబ్ తోపాటు సోషల్ మీడియా సెగ్మెంట్లో, యూట్యూమ్ లో 12.99 కోట్లు, సోషల్ మీడియాలో 10. 92 కోట్లు అంటే 19% వృద్ధి నమోదైంది.

ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) తోపాటు వరల్డ్ కప్ సహా స్పోర్ట్స్ కంటెంట్‌తో 2023 ఆసక్తికర సంవత్సరంగా వున్నప్పటికీ, జియో సినిమా వంటి ప్లేయర్ ప్రవేశంతో ప్రీమియం కంటెంట్ సెగ్మెంట్ ఉపద్రవంలో పడింది. ఇప్పుడు యూట్యూబ్ మార్గం ద్వారా వీడియో వీక్షణ వ్యవస్థలోకి వస్తున్న గ్రామీణ ప్రజలు పెయిడ్ కంటెంట్ వైపు చూసే అవకాశం తక్కువగా వుండవచ్చు.

ప్రస్తుతం ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో చెల్లింపు సభ్యత్వాలు సుమారు 60 లక్షలు చొప్పున వున్నాయి. మొత్తం చెల్లింపు సభ్యత్వాల్లో టాప్ 15 నగరాలన్నీ కలిసి 50% వాటాని కలిగి వున్నాయి. ఆదాయ ఆర్జన దృక్కోణం నుంచి ఇవి ముఖ్యమైన నగరాలే కావచ్చు కానీ చొచ్చుకుపోయేందుకు వీల్లేనంత సంతృప్త స్థాయికి చేరుకున్నాయి.

ఇంకొటేమిటంటే, ఒక వినియోగదారుడు సగటున సబ్‌స్క్రయిబ్ చేసిన యాప్‌ల సంఖ్య మెట్రోలలో నాలుగుగా వుంటే, చిన్న పట్టణాల్లో మూడు కంటే తక్కువగా వుంది. జండర్ పరంగా చూస్తే, పురుష సభ్యత్వాలు అధికంగా వున్నాయి. ఇక ఓటీటీ వీక్షకులు, థియేటర్ ప్రేక్షకులూ 70-80% తో సంతృప్త స్థాయికి చేరుకుని ఇక పెరగలేని పరిస్థితి వుంది.

వాస్తవం ఏమిటంటే, దేశంలో ఓటీటీ సెగ్మెంట్ ఇప్పటికీ దాని పోటీ టీవీ సెగ్మెంట్లో 55-60% మాత్రమే వుంది. మినీ-మెట్రోల్లో, చిన్న పట్టణాల్లో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఈ మీడియాని- అంటే ఓటీటీ సెగ్మెంట్ ని - స్వీకరించలేదు.

ఓర్మాక్స్ మీడియా సంస్థ ఓర్మాక్స్ ఓటీటీ ఆడియన్స్ రిపోర్ట్ 2023 ని - ఈ సంవత్సరం జూలై- సెప్టెంబర్ మధ్య సేకరించిన డేటా ఆధారంగా రూపొందించింది. ఈ అధ్యయనాన్ని జమ్మూ -కాశ్మీర్, లడఖ్ మినహా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిపింది.

Tags:    
Advertisement

Similar News