ఓటీటీ వాచ్ లిస్ట్ - 7 ఇంగ్లీష్ సిరీసుల స్ట్రీమింగ్!

ఇక ఓటీటీల్లో ఈవారం తెలుగు సినిమాలేవీ లేవు. ఒక హిందీ సినిమా వుంది. ఎప్పుడూ బారెడు వుండే ఓటీటీ వాచ్ లిస్టు బెత్తెడు అయింది. హిందీలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రవీనా టాండన్ లాయర్ పాత్రలో నటించిన ‘పాట్నా శుక్లా’ అనే లీగల్ డ్రామా ఈవారం కొత్త సినిమా.

Advertisement
Update:2024-03-26 13:30 IST

ఈవారం కూడా ఓటీటీలు, థియేటర్లు నెమ్మదించాయి. వేసవి వినోదాలకి సెలవు ప్రకటించాయి. కాకపోతే ఒకే ఒక్క తెలుగు సినిమా ఈ వారం థియేటర్లో విడుదల కాబోతోంది. గత వారం కూడా ఒకే ఒక్క తెలుగు సినిమా ‘ఓం భీమ్ బుష్’ విడుదలైంది. ఒకటే విడుదలైతే ఆ వారమంతా పోటీ లేకుండా లక్కే. ఇలాగే ఈ శుక్రవారం 29న థియేటర్లో ‘టిల్లూ స్క్వేర్’ మాత్ర మే విడుదలవుతోంది. ‘డీజే టిల్లూ’ హీరో సిద్దూ జొన్నలగడ్డ నటించిన మరో సినిమా ఇది.

ఇక ఓటీటీల్లో ఈవారం తెలుగు సినిమాలేవీ లేవు. ఒక హిందీ సినిమా వుంది. ఎప్పుడూ బారెడు వుండే ఓటీటీ వాచ్ లిస్టు బెత్తెడు అయింది. హిందీలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రవీనా టాండన్ లాయర్ పాత్రలో నటించిన ‘పాట్నా శుక్లా’ అనే లీగల్ డ్రామా ఈవారం కొత్త సినిమా. అలాగే ఇవాన్ మెక్‌గ్రెగర్ అమోర్ టౌల్స్ రచించిన ప్రసిద్ధ నవలకి అనుసరణగా ‘ఏ జెంటిల్‌మన్ ఇన్ మాస్కో’ ఇంగ్లీష్ సిరీస్ ఈవారం స్ట్రీమింగ్ అవుతోంది. ఇక టాప్ టీవీ కమెడియన్ కపిల్ శర్మ, అతడి బృందం కలిసి రూపొందించిన ‘గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ఓటీటీ స్పేస్‌లోకి వచ్చేసింది.

‘హార్ట్ ఆఫ్ ది హంటర్’ అనేది డియోన్ మేయర్ రాసిన పేరులేని నవలకి అనుసరణ. స్నేహితుడిని రక్షించడానికి ప్రమాదకరమైన ప్రపంచంలోకి తిరిగి ప్రవేశించిన రిటైర్డ్ హంతకుడి కథతో ఇంగ్లీషు మూవీ ఇది. మరో ఇంగ్లీస్ సిరీస్- ఆకర్షణీయమైన స్పోర్ట్స్ డ్రామా ‘ది బ్యూటిఫుల్ గేమ్’ నిరాశ్రయులైన ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాళ్ళ బృందం కథని చెబుతుంది. ఇలా మరికొన్ని ఫారిన్ సిరీస్ తో ఈవారం సరిపెట్టుకోవాల్సి వుంటుంది. మిగిలిన లిస్టు ఈ క్రింద చూడండి.

నెట్ ఫ్లిక్స్ లో 6

1. టెస్టామెంట్ : ది స్టోరీ ఆఫ్ మోజెస్ (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 27

2. రోంజా ది రాబర్ట్ డాటర్ (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 28

3. ది బాక్స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 28

4. ది బ్యూటీఫుల్ గేమ్ (ఇంగ్లీష్ సిరీస్) -మార్చి 29

5. హార్ట్ ఆఫ్ ది హంటర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 29

6. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (హిందీ సిరీస్) - మార్చి 30


Full View


డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 4

1. ట్రూ లవర్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27

2. మధు( ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మార్చి 29

3. పాట్నా శుక్లా (హిందీ సినిమా)- మార్చి 29

4. రెనెగడె నెల్ల్ (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 29

అమెజాన్ ప్రైమ్ లో 2

1. టిగ్ నొటారో (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 26

2. ఇన్ స్పెక్టర్ రిషి ( హిందీ సిరీస్)- మార్చి 29

జియో సినిమాలో 1

1. ఏ జెంటిల్ మ్యాన్ ఇన్ మాస్క్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 29

బుక్ మై షోలో 1

1. ది హోల్డోవర్స్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 29

Tags:    
Advertisement

Similar News