సినీ ప్రముఖుల ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ సోదాలు
దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులు,మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సాగుతున్న సోదాలు
సినీ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు ఇళ్లు, ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు సాగుతున్నాయి. మంగళవారం కూడా దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ బృందాలు బ్యాంకు లాకర్లు కూడా తనిఖీలు చేస్తున్నాయి. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే బృందాలు సోదాలు జరుపుతున్నాయి. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.