నాన్ హిందీ యాక్టర్ బన్నీ అక్కడ బిగ్గెస్ట్ స్టార్
అందుకే 'పుష్ప2' పాన్ ఇండియా కాదు.. తెలుగు ఇండియా సినిమా' అని పేర్కొన్న ఆర్జీవీ
'పుష్ప2'పై ఇప్పటికే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి స్పందించారు. హిందీలో ఈ మూవీ సృష్టించిన రికార్డు వసూళ్లను ఉద్దేశించి ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. 'హిందీలో డబ్బింగ్ సినిమా సత్తా చాటింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా 'పుష్ప2' హిస్టరీ క్రియేట్ చేసింది. నాన్ హిందీ యాక్టర్ అల్లు అర్జున్ అక్కడ బిగ్గెస్ట్ స్టార్‌గా నిలిచారు. అందుకే ఇది పాన్ ఇండియా కాదు.. తెలుగు ఇండియా సినిమా' అని పేర్కొన్నారు.
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైన విషయం విదితమే. ముందురోజు ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతున్నది. మూడురోజుల్లో హిందీలో రూ. 205 కోట్లకు పైగా ఈ సినిమా వసూళ్లు చేసిందని చిత్ర బృందం వెల్లడించింది. రిలీజ్ రోజే రూ. 72 కోట్లు (నెట్) కలెక్షన్స్ రాబట్టిన మూవీగా కొత్త రికార్డు నెలకొల్పింది. రెండో రోజు రూ. 59 కోట్లు, మూడో రోజు రూ. 74 కోట్లు వసూళ్లు చేసింది. వరల్డ్ వైడ్‌గా మొదటిరోజే రూ. 294 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఫస్ట్‌డే అంత మొత్తం రాబట్టి ఇండియన్ సినిమా ఇదే. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 621 కోట్ల క్లబ్లో చేరింది.