Kajal | అసలు మేటర్ బయటపెట్టిన కాజల్

Kajal Bharateeyudu 2 - భారతీయుడు-2లో కాజల్ లేదు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది.

Advertisement
Update:2024-06-06 22:12 IST

భారతీయుడు-2 సినిమా వచ్చేనెలలో విడుదల కానుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అంతా ఇదే అనుకున్నారు. కట్ చేస్తే, భారతీయుడు-2లో కాజల్ కనిపించదని దర్శకుడు శంకర్ స్పష్టం చేశాడు.

భారతీయుడు-2 సినిమా మొత్తం సిద్దార్థ్, రకుల్, కమల్ హాసన్ చుట్టూ నడుస్తుందట. పార్ట్-2లో కాజల్ ప్రమేయం లేదంటున్నాడు శంకర్. అతి కొద్ది సమయం మాత్రమే కాజల్ కనిపిస్తుందని, అప్పుడు తనను ఆడియన్స్ గుర్తుపట్టలేరని కూడా హింట్ ఇస్తున్నాడు.

ఇప్పుడిదే విషయాన్ని కాజల్ కూడా కన్ ఫర్మ్ చేసింది. భారతీయుడు-2లో తను కనిపించనని, పార్ట్-3లో మాత్రం తన భాగం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. తను చేసిన యాక్షన్ సన్నివేశాలు కూడా పార్ట్-3లో ఉంటాయని స్పష్టం చేసింది.

భారతీయుడు-2లో కాజల్ లేదు కాబట్టి, ఆ పార్ట్ వరకు కాజల్ ప్రచారం చేస్తుందా చేయదా అనేది ఆసక్తికరంగా మారింది. తను లేని సినిమాకు కాజల్ ఎందుకు ప్రచారం చేస్తుంది?

Tags:    
Advertisement

Similar News