రొటీన్ కమర్షియల్ మూవీ.. కానీ కొత్త కథ
పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తోంది మాచర్ల నియోజకవర్గం. అయితే ఇందులో సరికొత్త కథ కూడా ఉందంటున్నాడు నితిన్.
మాచర్ల నియోజకవర్గం.. ఈ సినిమా ట్రయిలర్ చూసినోళ్లకు ఎవరికైనా ఒకటే విషయం తడుతుంది. ఇదొక పక్కా కమర్షియల్ మూవీ అని అంతా ఫిక్స్ అయిపోయారు. రెగ్యులర్ మాస్ మసాలా అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని భావిస్తున్నారు. అయితే నితిన్ మాత్రం అలా భావించడం లేదు. తన సినిమా అంతకుమించి అంటున్నాడు ఈ హీరో.
"కథ కొత్తగా యూనిక్ గా ఉంటుంది. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా నచ్చింది. నేను ఐఎఎస్ పాత్ర ఇప్పటివరకు చేయలేదు. మాస్ సినిమా అయినప్పటికీ కథలో, క్యారెక్టర్ లో చాలా ఫ్రెష్ నెస్ ఉంటుంది. నేను సినిమా చూశాను. అద్భుతంగా వచ్చింది. ఫుల్ ఎంటర్ టైమెంట్, మంచి పాటలు, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ ఉన్నాయి. ఫ్యాన్స్ కి పండగలా ఉంటుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మొదటి రోజు మొదటి ఆటకి నేనూ థియేటర్ కి వెళ్తా."
ఇలా మాచర్ల నియోజకవర్గంపై అంచనాలు పెంచేలా మాట్లాడాడు నితిన్. ఫస్తు కమర్షియల్ అంశాలతో ఈమధ్య కాలంలో సినిమా రాలేదని, ఆ లోటును మాచర్ల నియోజకవర్గం తీరుస్తుందని నితిన్ చెబుతున్నాడు.
ఇక దర్శకుడు రాజశేఖర్ రెడ్డి గురించి చెబుతూ.. ఎడిటర్ గా ఉన్న అతడ్ని దర్శకుడిగా మారమని సలహా ఇచ్చింది తనేనని, తన కోసమే అతడు మాచర్ల నియోజకవర్గం కథ రాశాడని తెలిపాడు. అంతేకాదు, రాజశేఖర్ రెడ్డి రాసిన కథను సింగిల్ సిట్టింగ్ లో తను ఓకే చేశానని కూడా అంటున్నాడు నితిన్.