ముందు భయపడ్డాను.. ఇప్పుడు ఆనందపడుతున్నాను

కార్తికేయ2 సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి రెడీ అయినప్పుడు నిఖిల్ భయపడ్డాడట. దానికి కారణం కూడా వెల్లడించాడు ఈ నటుడు.

Advertisement
Update:2022-08-27 11:14 IST

కార్తికేయ2 సినిమాకు సంబంధించి విడుదలకు ముందు తన ఫీలింగ్స్ ను బయటపెట్టాడు హీరో నిఖిల్. ఈ సినిమాను హిందీలో డబ్ చేస్తామని నిర్మాతలు చెప్పినప్పుడు ముందు భయపడ్డానని, కానీ ఫలితం చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉందని అంటున్నాడు. ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిన సందర్భంగా కర్నూలులో భారీ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పై విధంగా స్పందించాడు నిఖిల్.

బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో హిందీలో కూడా తెలుగు సినిమాకు లైన్ క్లియర్ అయిందని, అదే ధైర్యంతో కార్తికేయ2ను హిందీలో విడుదల చేశామని తెలిపిన నిఖిల్.. తమ నమ్మకం నిజమైందని చెప్పుకొచ్చాడు. 50 స్క్రీన్స్ తో ప్రారంభమై, ప్రస్తుతం ఉత్తరాదిన 1200 స్క్రీన్స్ లో కార్తికేయ2 హిందీ వెర్షన్ ను ప్రదర్శిస్తున్నారని తెలిపాడు నిఖిల్.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అఖండ విజయం సాధించింది. ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న సినిమా కార్తికేయ2 మాత్రమే. తాజాగా వచ్చిన లైగర్ సినిమా ప్రభావం, కార్తికేయ-2పై ఉండదని తేలిపోయింది. దీంతో ఈ వీకెండ్ కూడా కార్తికేయ2 కు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. అటు నార్త్ లో కూడా పరిస్థితి ఇలానే ఉంది.

Tags:    
Advertisement

Similar News