నాకు బ్యాక్ గ్రౌండ్ లేదని నా సినిమాను తొక్కేశారు

కార్తికేయ-2 రిలీజ్ డేట్ విషయంలో ఏడ్చానంటున్నాడు నిఖిల్. తనకు బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి తొక్కేశారని ఆరోపిస్తున్నాడు.

Advertisement
Update:2022-07-31 15:43 IST

తన సినిమా రిలీజ్ కోసం కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఏడ్చాడట హీరో నిఖిల్. కార్తికేయ-2 సినిమా రోజురోజుకు ఆలస్యం అవ్వడం, చాలామంది ఆ సినిమా రిలీజ్ అవ్వదని చెప్పడంతో ఓ దశలో ఈ హీరో ఏడ్చాడంట. ఈ విషయాన్ని స్వయంగా నిఖిల్ బయటపెట్టాడు.

కార్తికేయ-2 ప్రమోషన్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు నిఖిల్.. ముందుగా సినిమాను జులై 22 అనుకున్నారు. కానీ ఆ టైమ్ కు థాంక్యూ సినిమాను తీసుకొచ్చారు. కార్తికేయ-2 సినిమాను బలవంతంగా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆగస్ట్ 5 అనుకున్నారు. ఆ తేదీకి బింబిసార వస్తోంది. దీంతో కార్తికేయ-2కు మరోసారి పోస్ట్ పోన్ తప్పలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల మధ్య ఆగస్ట్ 12న, నితిన్ సినిమాకు పోటీగా వస్తోంది కార్తికేయ-2.

ఇలా వరుసగా తన సినిమా రిలీజ్ వాయిదా పడుతుంటే, ఏడ్వడం తప్ప ఏమీ చేయలేకపోయానని అన్నాడు నిఖిల్. తన సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్ కు వాయిదా వేసుకోమని చాలామంది చెప్పారని, ఆ టైమ్ లో కన్నీళ్లు ఆగలేదన్నాడు. అయితే ఏదో ఒక టైమ్ లో, ఏదో ఒక సినిమాతో పోటీ తప్పదని, అలా నితిన్ సినిమాకు పోటీగా కార్తికేయ-2ను రిలీజ్ కు రెడీ చేశామంటున్నాడు.

తనకు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్లనే తన సినిమాను తొక్కేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నిఖిల్. అయితే తన నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ పట్టుబట్టి 12వ తేదీ వస్తున్నారని, ఈ విషయంలో వాళ్లకు హ్యాట్సాఫ్ చెప్పాలని అంటున్నాడు నిఖిల్.

Tags:    
Advertisement

Similar News