Niharika | పిల్లల కోసమైనా రెండో పెళ్లి చేసుకుంటా

Niharika Konidela - తను రెండో పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది నిహారిక. పిల్లల కోసమైనా పెళ్లి తప్పదని వ్యాఖ్యానించింది.

Advertisement
Update:2024-03-16 15:59 IST

మెగా డాటర్ నిహారిక కొణెదల మరోసారి తన విడాకులు, రెండో పెళ్లి అంశాలపై స్పందించింది. విడాకులపై ఇప్పటికే సుదీర్ఘంగా వివరణ ఇచ్చిన ఈమె, తాజాగా రెండో పెళ్లిపై స్పందించింది. తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటానని తెలిపింది.

తనకు పిల్లలంటే ఇష్టం అంటోంది నిహారిక. కాబట్టి పిల్లల కోసమైనా ఇంకో పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది. అయితే అది ఎప్పుడు, ఎవరితో అనేది తనకు కూడా తెలియదంటోంది. ప్రస్తుతం తను సింగిల్ గానే ఉన్నానని, కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టానని తెలిపింది.

రీసెంట్ గా ఓ తమిళ సినిమా స్టార్ట్ చేసింది నిహారిక కొణెదల. ఈ మూవీతో పాటు తెలుగులో వాట్ ది ఫిష్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇంకో సినిమా ప్రకనట త్వరలోనే రానుంది. వీటితో పాటు నిర్మాణ రంగంలో కూడా ఆమె బిజీగా ఉంది.

ఓవైపు ఇలా ప్రొఫెషనల్ గా బిజీగా ఉంటూనే, ఏదో ఒక టైమ్ లో ప్రేమలో పడే అవకాశం ఉందంటూ తెలిపింది. జీవితంలో ఎదురైన ఎదురుదెబ్బల్ని పాఠాలుగా మలుచుకొని, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి తను సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. 

Tags:    
Advertisement

Similar News