అప్పుడు సల్మాన్‌ ను అపార్థం చేసుకున్నా

ఆ రోజంతా నా వెంట పడ్డారో తర్వాత తెలిసిందన్న నటి భాగ్యశ్రీ

Advertisement
Update:2025-01-01 13:05 IST

మైనే ప్యార్‌ కియా తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి భాగ్యశ్రీ. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఈ మూవీతో ఆమె సుమన్‌ పాత్రలో యాక్ట్‌ చేసి.. తన అందచందాలతో యువ హృదయాలను కొల్లగొట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సల్మాన్‌ గురించి మాట్లాడారు. ఆ సినిమా నాటికే తాను హిమాలయ దాసానితో ప్రేమలో ఉన్నానని అన్నారు. ఒకానొక సమయంలో తాను సల్మాన్‌ను అపార్థం చేసుకున్నానని తెలిపారు.

మైనే ప్యార్‌ కియా షూటింగ్‌ వల్ల సల్మాన్‌తో నాకు మంచి రిలేషన్‌ ఏర్పడింది. షూటింగ్‌ జరుగుతున్న రోజుల్లో ఓసారి సల్మాన్‌ నా పక్కన కూర్చుని చెవిలో ఒక ప్రేమ పాట పాడారు. ఆ రోజంతా నా వెంట పడ్డారు. ఆయన ప్రవర్తన నాకు ఏమాత్రం అర్థం కాలేదు. ఆయన నన్ను ఆట పట్టిస్తున్నారని అనుకున్నా. కొంతసేపటికి అది హద్దులు దాటింది. మీరెందుకు ఇలా చేస్తున్నారు? అని కోప్పడ్డాను. వెంటనే ఆయన పక్కకు తీసుకువెళ్లి.. నువ్వు ఎవరితో ప్రేమలో ఉన్నావో నాకు తెలుసు. నీ లవర్‌ హిమాలయ గురించీ తెలుసు. ఆయన్ని ఒక్కసారి సెట్ కు పిలవొచ్చు కదా అన్నారు. నా లవ్‌స్టోరీ ఆయనకు ఎలా తెలిసిందా? అని ఆశ్చర్యపోయాను. ఆరోజంతా ఆయన ఎందుకు అలా ప్రవర్తించారో అప్పుడు అర్థమైంది. నా లవ్‌స్టోరీ గురించి తెలిసి నన్ను ఆట పట్టించడానికే ఆ విధంగా చేశారని తెలుసుకున్నా అని భాగ్యశ్రీ చెప్పారు.

సూరబ్‌ బర్జాత్యా డైరెక్షన్‌లో వచ్చిన మైనే ప్యార్‌ కియా సినిమాతోనే భాగశ్రీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా విడుదలైన కొంతకాలానికే ఆమె హిమాలయ దసానీతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా.. ఆ తర్వాత పిల్లలు, కుటుంబ బాధ్యతకే ప్రాధాన్యం ఇచ్చి కెరీర్‌ నుంచి విరామం తీసుకున్నారు. ఇటీవల రాధేశ్యామ్‌, తలైవి, కిసీ కా భాయ్‌ కిసీకా జాన్‌ వంటి మూవీస్‌లో నటించిన విషయం విదితమే. 

Tags:    
Advertisement

Similar News