నాలుగో పెళ్లికి సిద్దమైన ప్రముఖ హీరోయిన్

తమిళ హీరోయిన్ వనితా విజయకుమార్ నాలుగో పెళ్లికి సిద్దమైంది. కొరియోగ్రాఫర్‌ రాబర్ట్‌తో ఆక్టోబర్ 5న వీరి వివాహం జరుగనుందని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

Advertisement
Update:2024-10-01 16:24 IST

తమిళ నటి వనితా విజయకుమార్ నాలుగో పెళ్లికి సిద్దమైంది. కొన్నాళ్లు క్రితం ఈ విషయమై రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అవి నిజమని తేలిపోయాయి. తనకు తెలిసిన వ్యక్తి రాబర్ట్ అనే కొరియోగ్రాఫర్‌తోనే మనువడబోతుంది. ఆక్టోబర్ 5న వీరి వివాహం జరుగనుందని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని వారికి విడాకులు ఇచ్చేసిన ఈ బ్యూటీ తాజాగా నాలుగో పెళ్లికి సిద్ధమైంది.అయితే పెళ్లిడుకోచ్చిన కూతుర్ని పెట్టుకొని అల్లుడు వచ్చే స్టేజీలో మళ్ళీ మ్యారేజ్‌కి సిద్దమైంది. ప్రముఖ నటినటులు మంజుల, విజయ్ కుమార్ ల కూతురు వనిత విజయ్ కుమార్. ఈమె తెలుగు కంటే ఎక్కువగా తమిళ, కన్నడ, మలయాళం మూవీస్‌లో నటించింది..ఇక టాలీవుడ్‌లో ఈమె దేవి చిత్రంలో చేసింది. అలాగే నరేష్ పవిత్ర లోకేష్ కలిసిన నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి క్యారెక్టర్ లో నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుంది.తాజాగా నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రియుడిని పరిచయం చేసి పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేసింది.

వనిత విజయ్ కుమార్ మొదట ఆకాష్‌ని మ్యారేజ్ చేసుకుంది. ఆయనతో కొడుకు, కూతురు పుట్టాక విడాకులు ఇచ్చేసి తర్వాత బిజినెస్ మాన్ అయినటువంటి ఆనంద్ జయ దర్శన్ ని రెండో వివాహం చేసుకొని ఆయనతో కూడా ఓ కూతురికి జన్మనిచ్చింది. కానీ ఆయనతో కూడా ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోయింది. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో డేటింగ్ లో ఉండి సడన్గా ఫోటోగ్రాఫర్ అయినటువంటి పీటర్ పాల్ ని మూడో పెళ్లి చేసుకుంది. అయితే ఆయనతో కూడా బ్రేకప్ అయ్యాక నేను పీటర్ ని పెళ్లి చేసుకోలేదు కేవలం నిశ్చితార్థం మాత్రమే చేసుకున్నాను అని ట్విస్ట్ ఇచ్చింది. అయితే తాజాగా మూడో బాయ్ ఫ్రెండ్ అయినటువంటి కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో మళ్ళీ ప్యాచప్ అయ్యి ఆయనతో పెళ్లికి రెడీ అయిపోయింది. వనిత వయసు 43 ఏళ్లు. ఈమె కూతురు జోవిక కూడా బిగ్ బాస్ తమిళ సీజన్ 7లో పోటీ పడింది. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు పోటీ పడుతుంది.

Tags:    
Advertisement

Similar News