నెట్ ఫ్లిక్స్ లో నయన్-విఘ్నేష్ పెళ్లి వీడియో
గుంభనంగా జరిగిన నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లిని త్వరలోనే అంతా చూడొచ్చు. ఈ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ కు వస్తోంది.
లాంగ్ టైమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార-విఘ్నేష్ శివన్ జంట.. పెళ్లి తర్వాత కూడా వార్తల్లో నలుగుతోంది. ఈసారి ఆ పెళ్లి విషయమే హాట్ టాపిక్ గా మారడం విశేషం. నెట్ ఫ్లిక్స్ తో ఈ జంటకు వివాదం నెలకొందని చాలామంది రాసుకొచ్చారు.
నయన్-విఘ్నేష్ పెళ్లి హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. అయితే విఘ్నేష్, నయనతార తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ విషయంలో నెట్ ఫ్లిక్స్, కొత్త జంట మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అంతేకాదు పెళ్లికి తాము ఖర్చుపెట్టిన సొమ్మును కూడా వెనక్కి ఇవ్వమని నెట్ ఫ్లిక్స్ అడిగిందని కూడా టాక్ నడిచింది.
దాదాపు పాతిక కోట్ల రూపాయల దాకా ఈ సెలెబ్రిటీ జంట ఆ ఓటీటీ సంస్థకు చెల్లించాల్సి రావచ్చు అంటూ ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఇదంతా పుకారు మాత్రమే. ఎలాంటి వివాదం లేదు. దీనిపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది నెట్ ఫ్లిక్స్.
నయనతార- విఘ్నేష్ అందమైన ఫోటోలను షేర్ చేసిన సదరు సంస్థ.. త్వరలోనే వాళ్ల పెళ్లి వీడియోను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు పెడతామని ప్రకటించింది. సో.. త్వరలోనే జనమంతా ఈ ప్రేమ జంట పెళ్లి చూడొచ్చన్నమాట.