Nayanthara | కరీనా స్థానంలో నయనతార

Nayanthara - సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, యష్ తో కలిసి నటించబోతోంది. అయితే హీరోయిన్ గా మాత్రం కాదు.

Advertisement
Update:2024-05-04 13:31 IST

యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమా చుట్టూ కరీనా కపూర్ పేరు బాగా వినిపిస్తోంది. అయితే ఆమె కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ సినిమాలో యష్ కు సోదరిగా కరీనా కపూర్ నటించడానికి ముందు ఓకే చెప్పింది. కానీ ఇప్పుడు ఈ కాంబినేషన్ కలవడం లేదు.

లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతారను ఈ సినిమా కోసం తీసుకున్నారట. యష్ సరసన హీరోయిన్ గా కాదు.. కరీనా కపూర్ వద్దనుకున్న సోదరి పాత్రను నయనతార చేయబోతోంది. అంటే.. సినిమాలో యష్ కు సోదరిగా నయనతార కనిపించనుందన్నమాట. వినడానికి ఇది కాస్త ఆసక్తికరంగానే ఉంది.

కొన్ని రోజులుగా మేకర్స్, నయనతార మధ్య చర్చలు సాగుతున్నాయి. స్క్రిప్ట్ నయన్ కు బాగా నచ్చింది. దాదాపు ఈ పాత్ర చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. కరీనా తప్పుకున్నప్పటికీ, నయనతార రాకతో ఈ ప్రాజెక్టుకు మరింత వెయిట్ పెరిగింది. ఎందుకంటే, బాలీవుడ్ లో నయనతార కూడా పాపులర్. పైగా లేటెస్ట్ సెన్సేషన్ కూడా.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్, టాక్సిక్ కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News