Dasara Movie: నాని దసరా మూవీ షూటింగ్ అప్ డేట్స్

Nani's Dasara Movie: దసరా మూవీ కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి క్లయిమాక్స్ పార్ట్ షూట్ చేస్తున్నారు.;

Advertisement
Update:2022-12-18 21:03 IST
Dasara Movie: నాని దసరా మూవీ షూటింగ్ అప్ డేట్స్
  • whatsapp icon

నాని, కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పుడీ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో దసరా షూటింగ్ జరుగుతోంది. సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ పార్ట్ ను ఇక్కడ షూట్ చేస్తున్నారు. 2 రోజుల కిందట మొదలైన ఈ షెడ్యూల్, మరో 10 రోజుల పాటు కొనసాగనుంది.

అయితే ఇక్కడే నాని తన మార్క్ చూపిస్తున్నాడు. ఈ షెడ్యూల్ అయిన తర్వాత రషెష్ మొత్తం చూడబోతున్నాడు నాని. తనకు సంతృప్తికరంగా అనిపిస్తేనే నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాడు. లేదంటే ఇదే షెడ్యూల్ ను మళ్లీ అదే సెట్ లో రీషూట్ చేస్తాడు.

దసరా సినిమాకు క్లయిమాక్స్ ప్రాణం. అందుకే ఎన్ని రోజులైనా క్లయిమాక్స్ పార్ట్ బాగా వచ్చేవరకు షూట్ చేయాలని నిర్ణయించాడు నాని. ఈ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత నాని-కీర్తిసురేష్ పై సాంగ్స్ షూటింగ్ ఉంటుంది

సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. నాని కెరీర్ లోనే భారీబడ్జెట్ మూవీగా వస్తోంది దసరా.

Tags:    
Advertisement

Similar News