బ్రాహ్మణ పాత్ర కోసం నాగశౌర్య ఏం చేశాడంటే?

కృష్ణా వ్రిందా విహారి సినిమాలో బ్రాహ్మణ కుర్రాడిగా కనిపించాడు శౌర్య. ఆ పాత్ర పోషించడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందంటున్నాడు.

Advertisement
Update:2022-09-23 08:49 IST

కృష్ణ వ్రిందా విహారి.. నాగశౌర్య హీరోగా నటించిన సినిమా. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రాహ్మణ కుర్రాడిగా కనిపించాడు శౌర్య. ఈ పాత్ర చేయడానికి చాలా కష్టపడ్డానని చెబుతున్నాడు. తన గ్యాంగ్ లో కూడా ఓ బ్రాహ్మణుడు ఉన్న విషయాన్ని బయటపెట్టాడు.

"అదుర్స్, డిజే, అంటే సుందరానికీ,.. ఇలా ఎన్నో సినిమాల్లో బ్రాహ్మణ పాత్రలున్నంత మాత్రాన పాత్రలు, కథలు ఒకటి కాదు. దేనికదే భిన్నమైనది. 'కృష్ణ వ్రింద విహారి' కూడా భిన్నమైన కథ. కమల్ హాసన్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా చాలా పెద్ద స్టార్లు బ్రహ్మణ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ పాత్ర చేస్తున్నపుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. నాకు బాగా తెలిసిన అవసరాల శ్రీనివాస్ బ్రాహ్మిన్ కావడం వలన ఆయనకి తెలియకుండానే ఆయన దగ్గర నుండి కొన్ని నేర్చుకున్నాను."

ఇలా తన ఫ్రెండ్ అవసరాల శ్రీనివాస్ ను చూసి కొన్ని మేనరిజమ్స్ నేర్చుకున్నాననే విషయాన్ని బయటపెట్టాడు శౌర్య. తన కొత్త సినిమా కోసం ఈ హీరో వినూత్నంగా పాదయాత్ర చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో చేసిన ఆ పాదయాత్ర వల్ల తన ఆరోగ్యం కొంచెం దెబ్బతిందని కూడా అన్నాడు.

ఈరోజు థియేటర్లలోకి వచ్చింది కృష్ణా వ్రిందా విహారి సినిమా. ఈ సినిమాతో షిర్లీ సెటియా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.

Tags:    
Advertisement

Similar News