Nagarjuna | విలన్ గా నాగార్జున?

Nagarjuna - రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో నాగ్ విలన్ గా కనిపించబోతున్నాడా? ఇందులో నిజమెంత?

Advertisement
Update: 2024-07-25 04:34 GMT

రజనీకాంత్ సినిమాలో నాగార్జున విలన్‌గా కనిపిస్తాడనే ప్రచారం కొన్ని రోజులుగా నడుస్తోంది. తాజాగా ఈ వార్తల్ని నాగ్ టీమ్ ఖండించింది. నాగ్ విలన్ గా కనిపించడం లేదని స్పష్టం చేసింది. అసలు నాగార్జునపై ఇంత వెరైటీ పుకారు రావడానికి కారణం ఏంటి?

రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్‌గా నటిస్తున్న సినిమా “కూలీ”. ఈ సినిమాలో ఓ విలన్ పాత్ర ఉంది. దీని కోసం నాగార్జునను సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. దీనికి కారణం దర్శకుడు లోకేష్ కనగరాజ్.

లోకేష్ కనగరాజ్‌కి విలన్ పాత్రల కోసం కూడా స్టార్స్ ను తీసుకుంటాడనే సంగతి తెలిసిందే. అతను విజయ్ సేతుపతిని "మాస్టర్", "విక్రమ్" సినిమాల కోసం తీసుకున్నాడు. లియో కోసం సంజయ్ దత్ ను విలన్ గా తీసుకున్నాడు. ఇక "విక్రమ్" క్లయిమాక్స్ లో స్టార్ హీరో సూర్యను నెగిటివ్ రోల్‌లో చూపించాడు.

ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టే, కూలీ సినిమా కోసం అతడు నాగార్జునను విలన్ గా తీసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ నాగ్ టీమ్ దాన్ని ఖండించింది. మరోవైపు ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న “కుబేర”లో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News