Nabha Natesh | యాక్సిడెంట్ పై స్పందించి నభా నటేష్

Nabha Natesh - తొలిసారి తనకు జరిగిన యాక్సిడెంట్ పై స్పందించింది నభా నటేశ్. అందుకే రెండేళ్లు గ్యాప్ వచ్చినట్టు వెల్లడించింది.

Advertisement
Update:2024-07-13 22:16 IST

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ నభా నటేష్ విలేకరుల సమావేశంలో పాల్గొంది. తనకు జరిగిన యాక్సిడెంట్ పై స్పందించింది.

"ఆడియన్స్ కి నా ఎనర్జీ ఇష్టం. యాక్సిడెంట్ వల్ల నా భుజానికి గాయమైంది. మళ్ళీ ఫుల్ గా ఫిట్ అయి మునుపటి ఎనర్జీ వచ్చిన తర్వాతే స్క్రీన్ మీద కనిపించాలని భావించాను. అందుకే బ్రేక్ వచ్చింది. ఇప్పుడు డార్లింగ్ తో మళ్ళీ ప్రేక్షకులు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు రెండేళ్ళుగా నా నుంచి సినిమా రిలీజ్ లేదు. థియేటర్స్ లో ప్రేక్షకులు నన్ను చూడటానికి, నన్ను నేను థియేటర్స్ లో చూసుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను."

డార్లింగ్ సినిమాలో పోషించిన పాత్రతో తన డ్రీమ్ నెరవేరిందని చెప్పుకొచ్చింది నభా నటేష్. దీన్ని తన డ్రీమ్ రోల్ గా చెప్పుకొచ్చింది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ తాజాగా రిలీజైంది. మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది.

Tags:    
Advertisement

Similar News