మాట్కా మూవీ టీజర్‌ విడుదల..మెగా ఫ్యాన్స్‌కి పండుగే

వైజాగ్ అంటే ఒకటి సముద్రం గుర్తుకు రావాలి లేదా ఈ వాసు గుర్తుకు రావాలి అంటూ వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్‌తో మట్కా టీజర్ రిలీజ్ అయింది.

Advertisement
Update:2024-10-05 16:54 IST

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం మాట్కా. ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని విజయవాడ జీ3 సినిమా థియేటర్‌లో మట్కా మూవీ టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ దేశంలో చలామణి అయ్యే ప్రతి రూపాయిలో 90 పైసలు నూటికి ఒక్కడే సంపాదిస్తున్నాడు. మిగ‌త 10 పైస‌ల కోసం 99 మంది కొట్టుకుంటారు. నాలాంటోళ్లు. నువ్వు ఆ 90 పైస‌లు సంపాదించేవాడివి. 99 మందిలో ఒక్క‌డిగా మిగిలిపోకు. నీకు ఆ ద‌మ్ము ఉంది అంటూ డైలాగ్‌తోనే టీజ‌ర్ మొద‌లైంది.

1958 నుంచి 1982 వరకు సాగే పీరియాడిక్ స్టోరీలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. నవంబర్ 14న మట్కా మూవీ విడుదల కానుంది. వైజాగ్ అంటే ఒకటి సముద్రం గుర్తుకు రావాలి లేదా ఈ వాసు గుర్తుకు రావాలి అంటూ వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు ప్రమోషన్లు ఇప్పటికే షురు అయ్యాయి. మంచి హైప్ క్రియేట్ అవుతోంది. మట్కా మూవీ హిట్ కావడం పక్కా అని టీజర్ చూస్తే.. స్పష్టంగా అర్థమవుతోంది. ప‌లాస 1978 సినిమాతో హిట్ అందుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. విజేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ చిత్రన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Tags:    
Advertisement

Similar News