మాస్ రాజా నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది

మాస్ రాజా నుంచి మాస్ సాంగ్ వస్తే ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటుంది. ఈసారి కూడా అలాంటి స్పెషల్ వచ్చేసింది. ధమాకా నుంచి ఊర మాస్ సాంగ్ రిలీజైంది.

Advertisement
Update:2022-09-24 14:04 IST
మాస్ రాజా నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది
  • whatsapp icon

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం 'ధమాకా'. ఈ సినిమా ప్రమోషన్లు ఇప్పటికే మొదలయ్యాయి. ఇప్పుడు వాటిని రెట్టింపు చేస్తూ మాస్ రాజా అనే టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. 'మాస్ రాజా' టైటిల్ కి తగ్గట్టే మాస్ కి పూనకాలు తెప్పించేలా ఉంది ఈ పాట.

భీమ్స్ సిసిరోలియో 'మాస్ రాజా' పాటని థియేటర్లు దద్దరిల్లేలా మాస్ డ్యాన్స్ నంబర్ గా కంపోజ్ చేశాడు. సాంగ్ వీడియోలో రవితేజ సిగ్నేచర్ మూమెంట్ అదిరింది. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మాస్ కి డబుల్ ఇంపాక్ట్ ని ఇచ్చింది. నకాష్ అజీజ్ ఈ పాటని ఫుల్ గ్రేస్ తో పాడాడు.

ఫస్ట్ సింగిల్ గా వచ్చిన 'జింతాక్‌' సాంగ్ కు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మాస్ రాజా అనే లిరిక్స్ తో వచ్చిన ఈ పాట ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజకు జోడిగా శ్రీలీల సందడి చేయనుంది. పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నాడు. 


Full View


Tags:    
Advertisement

Similar News