Kannappa Movie | డిసెంబర్ లో కన్నప్ప

Kannappa Movie - మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప. ఈ సినిమాకు విడుదల తేదీ లాక్ అయింది.

Advertisement
Update:2024-07-19 22:28 IST

విష్ణు మంచు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎపిక్ యాక్షన్ మైథలాజికల్ డ్రామా కన్నప్ప. ఇది అతడి డ్రీమ్ ప్రాజెక్టు. షూటింగ్ పూర్తి చేసుకున్న కన్నప్ప సినిమాకు విడుదల తేదీ ప్రకటించారు. డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు మంచు విష్ణు స్వయంగా ప్రకటించాడు.

భారీ స్థాయిలో కన్నప్ప చిత్రం వస్తోంది. సినిమాలో గ్రాఫిక్స్ పార్ట్ ఎక్కువ. అందుకే మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం చాలా టైమ్ తీసుకుంటున్నారు. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించడానికి, అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన వెంటనే పాటల ప్రచారం మొదలుపెడతారు. కన్నప్ప ఒక అద్భుతమైన భారతీయ చలనచిత్రం. భారతదేశ సంస్కృతిని చాటిచెబుతూనే, భక్త కన్నప్ప పురాణ గాథను ఇది చెబుతుంది,

కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణుకు చెందిన అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ కూడా నటిస్తున్నారు. కన్నప్ప చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో విడుదల చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News

'అఖండ 2' షురూ