Manchu Manoj | తండ్రి కాబోతున్న మనోజ్

Manchu Manoj - మంచు మనోజ్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు.

Advertisement
Update:2023-12-17 13:50 IST

మంచు మనోజ్ శుభవార్త పంచుకున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత మంచు మనోజ్ తిరిగి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అతను ఇటీవలే ‘ఉస్తాద్’ అనే రియాలిటీ గేమ్ షోను ప్రారంభించాడు. ఇప్పుడు మంచు మనోజ్ మరో శుభవార్త పంచుకున్నాడు.

తను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు మనోజ్. అతని భార్య భూమా మౌనిక రెడ్డి ఇప్పుడు గర్భవతి. ఈ వార్తను ప్రకటించే ముందు మంచు మనోజ్ భూమా శోభా నాగి రెడ్డిని గుర్తుచేసుకుంటూ ఓ నోట్ రాశాడు.

2015 మే నెలలో, మనోజ్ ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నాడు, కానీ ఆ సంబంధం 2019లో విడాకులతో ముగిసింది. మనోజ్ ఈ ఏడాది మార్చిలో భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి కుమార్తె ఈమె.

మౌనికకు ఇదివరకే పెళ్లయింది. ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఆ బంధం వీగిపోయింది. ఆ తర్వాత మనోజ్ ను పెళ్లాడింది. ఇప్పుడు మంచు మనోజ్ ద్వారా మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది మౌనిక. ప్రస్తుతం మనోజ్-మౌనిక దంపతులు ఆనందపు క్షణాల్ని ఆస్వాదిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News